Suryaa.co.in

Andhra Pradesh

క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలికి లోకేష్ సాయం

-సీఎంఆర్ఎఫ్ చెక్కు మంత్రి అందజేత

అమరావతి: క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న మహిళకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సాయం అందించి అండగా నిలిచారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన 38 ఏళ్ల ఎం.స్వర్ణ దుర్గ కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతోంది. వైద్యం కోసం ఆసుపత్రిని సంప్రదించగా.. చికిత్స నిమిత్తం సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అయింది.

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న తమకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించి ఆదుకోవాలని భర్త మాదల చంద్రశేఖర్ ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2,51,075 చెక్కును అందజేసి వారి కుటుంబానికి తోడ్పాటును అందించారు. సమస్యను సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన వెంటనే స్పందించి ఆదుకున్న మంత్రి నారా లోకేష్ కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

LEAVE A RESPONSE