Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నోటిని ఆ వెంకటేశ్వర స్వామే శుద్ధి చేస్తున్నాడు

– మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
– కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై పాలకుల కలంకిత మాటలను నిరసిస్తూ మచిలీపట్నం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పేర్ని నాని, నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ పేర్ని కిట్టు

మచిలీపట్నం : నిన్నటి వరకు తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నానా యాగీ చేశాడు. నిన్నటి రోజున కల్తీ నెయ్యి దానిలో వాడారో తెలియదు అని అంటున్నాడు. దీని బట్టి చూస్తుంటే కేవలం జగన్ ని రాజకీయంగా అంతం చేసేందుకే చంద్రబాబు తిరుపతి లడ్డూపై కలంకితం మాటలు మాట్లాడుతున్నాడు.

వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం జగన్ తిరుపతి వెళతానంటే కొండపైన ప్లెక్సీలు పెట్టిస్తారా?అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి అని ఏ నాడైనా తిరుపతి కొండపై పిలెక్సీలు పెట్టారా? జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నాడని తెలిసిన వెంటనే ఆ ప్లెక్సీలు తీయించేస్తారా? కాషాయం దుస్తులు వేసుకున్న దొంగ భక్తులను జగన్ ఇంటికి పంపి గేట్లకు కాషాయం రంగులు పులుమిస్తారా?

LEAVE A RESPONSE