Suryaa.co.in

Andhra Pradesh

వారధి ఫిర్యాదులో లవ్ జిహాద్ కేసు

అమరావతి: భారతీయ జనతా పార్టీ వారధి లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫిర్యాదు లు స్వీకరించారు. ఈ సందర్భంగా కడప కు చెందిన లవ్ జిహాద్ కేసు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. రామిరెడ్డి భరత్ భూషణ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు లో తన కుమార్తె రామిరెడ్డి జ్వలితకు సంబంధించిన ఒక ఇబందికరమైన సంఘటనను నివేదించాడు జూలై 12, 2024న, మేము జ్వలితను ఒంటరిగా వదిలి, బంధువుల ఇంటికి ఉదయం 9 గంటలకు మా ఇంటి నుండి బయలుదేరాము.

మేము ఉదయం 11 గంటలకు తిరిగి వచినపుడు, మా తలుపులు తెరిచి ఉన్నాయి, ఒక లాకర్ 4,80,000 రూపాయలు మరియు 26 తులాల బంగారం ఖాళీ చేయబడింది మరియు నా కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల వారిని విచారించిన తరాళ్ల, ఆమె ఆచూకీ పై మాకు ఎలాంటి సమాచారం లేదు.

ఉదయం 11:30 గంటలకు, కడపలోని దిశా పోలీస్ స్టేషన్ నుండి మాకు కాల్ వచింది, షేక్ హండే ఫజుల్లులా జ్వలితతో పారిపోయి, ఆమెను ఇస్లాం మతంలోకి మారిందని మరియు ఇస్లామిక్ ఆచారాల ప్రకారం ఆమెను వివాహం చేసుకునాడని మాకు సమాచారం అందించింది. తాను, ఫజుల్లులా ఒకే కాలేజీలో చదువుకున్నామని, అకడ అతను తన వక్తిగత ఫోటోలు, వీడియోలను పొందాడని, వాటిని ఉపయోగించి తనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడని, నిరాకరిస్తే వాటిని బయటపెడతానని బెదిరించాడని జ్వలిత వెల్లడించింది.

ఫజుల్లులా మామ, షేక్ షమీలుల్లా, అతని రెండవ భార్యబి. సునీత, ఏఆర్ కానిస్టేబుల్ ప్రతాపు ఈ పరిస్థితిని ప్లాన్ చేసి, నిరహించడంలో కీలక పాత్ర ఉండని మా దృష్టికి వచింది. జూలై 14న, పోలీసులు నా కుమార్తెతో మధ్యవర్తిత్వం నడిపి . ఆమె మొదట్లో తన ఎంపికలను పరిశీలించడానికి ఒక వారం పాటు కార్టంటైన్ హెూమ్ లోఉండటానికి అంగీకరించింది. మరియు ఆమె ఇంటికి తిరిగి వస్తానని మాకు హామీ ఇచింది.

అయితే, ఫజుల్లులా నివాసం నుండి తన వస్తువులను తిరిగి తీసుకురావడానికి ఆమె దిశా పోలీస్ స్టేషన్ నుండి బయలుదేరింది.అపటి నుండి కనిపించలేదు. వారు జులై 16, 2024న పాసోర్ట్ కోసం తక్తాల్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకునారని, ఎలాంటి సమసలు లేకుండా ఆమె పాసోర్ట్ దరఖాస్తుకు పోలీసు రక్షణ మరియు క్లియరెన్స్ కోరుతూ హైకోర్టులో జూలై 18, 2024న రిట్ పిటిషన్నుదాఖలు చేసినట్లు మేము కనుగొన్నాము.

ఆమెను సౌదీ అరేబియా తీసెకెల్లడానికి తక్తాల్లో పాసోర్టు దరఖాస్తు చేశాడు. ఈ విషయం తెలుకొని ఇంట్లో నుండి పోయిన బంగారు, నాగదు వాటి మేధా SP కి ఫిర్యాదు ఇచాం, SP మాకు సహకరించి చిన్నచౌక్ స్టేషన్ మునపటి CI నరసింహారెడ్డి కి కేసు ఫైల్ చేయమని చెపేరు. ఏవో కారణాలు చెప్పికేస్ ఫైల్ చేయకపోవడం వల్ల మా అమయి పాసోర్ట్ అప్లికేషన్ కి అప్రూవల్ ఇవమని ఒచింది, ఇపుడు నా కూతురు ని సౌదీ అరేబియా తీసెకెల్లడానికి ఫజుల్లులా ప్రయతిస్తున్నారు. మేము విచారించగా, ఫజుల్లులా తో ఏలాంటి అస్థిపస్తులు లేవు అని తెలిసింది, మా అమాయి నీ సౌదీ అరేబియా కి తీసుకొని వెళ్ళి అకడ అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది లవ్ జిహాద్ గా భావిస్తున్నాం అని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.ఈ నేపథ్యంలో కడప ఎస్పీ కి కేంద్ర మంత్రి ఫోన్ లో సంప్రదించి రామిరెడ్డి భరత్ భూషణ్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు.

పగడాల ఉమామహేశ్వరరావు కుమార్తె భవ్య, అల్లుడు సుధీర్ డెన్మార్క్ లో నివసిస్తున్నారు.మేనెల 2023మే మాంసం లో బాబు పుట్టగా బాబు కి బ్రెయిన్ లో సమస్య వేస్తే అందుకు తల్లిదండ్రులు దే భాద్యతలు అని డెన్మార్క్ దేశ చట్ట ప్రకారం బాబును చైల్డ్ హోం కు తరలించారు అయితే మన విదేశాంగ శాఖ ద్వారా ప్రయత్నం చేసి ఇప్పించాలని కుటుంబం కోరింది.

వారధి కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, రెడ్డి పావని, ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE