Suryaa.co.in

Andhra Pradesh

మహాత్మా గాంధీ ఆశయాలు అనుచరనీయం

– జాతిపితకు ఘన నివాళులు అర్పించిన కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం

రామచంద్రపురం : ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం సాధించేందుకు పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం లో కూటమి నాయకులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో గురువారం రామచంద్రపురం వేగాయమ్మపేట పంచాయతీ ఆవరణలో ఉన్న మహాత్మ, జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ సత్యం,అహింస అనే అస్త్రాలను ఆయుధాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్ర ఫలాలు అందేలా కృషి చేసిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించటం ప్రతి భారతీయుని కర్తవ్యం అన్నారు.

LEAVE A RESPONSE