Suryaa.co.in

Andhra Pradesh

అమెరికన్ ఆసుపత్రి దగ్గర యు టర్న్ ఉండేలా చూస్తా

– జాతీయ రహదారిపై యు టర్న్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విజయవాడ: కృష్ణలంక ఆమెరికన్ ఆసుపత్రి దగ్గర మూసి వేసిన యుటర్ను తెరిపించేలా నేషనల్ హైవే, మున్సిపల్, పోలీస్, ఆర్టీఏ అధికారులతో తాను మాట్లాడతానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.

శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారిపై అమెరికన్ ఆసుపత్రి దగ్గర ఉన్న యుటర్ను ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టాఫ్రిక్ ఎసీపీ ఎస్.ఆరవంశీధర్, రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ మోటార్ వీలర్ ఇన్సిపెక్టర్ డీవీ. రమణతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు, ప్రమాదాలు జరగకుండా నేషనల్ హైవే అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణం వల్లనే నగరాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కృష్ణలంక అంటే లంక మాదిరిగా ఒక వైపున కృష్ణానది, మరో వైపున జాతీయ రహదారి ఉన్నాయని, వాటిని దాటే సమయంలో చాలా జాగ్రతుల వహించాలన్నారు.

అమెరికన్ ఆసుపత్రి దగ్గర ఉన్న యు టర్ను మూసి వేయడం వల్ల కృష్ణలంక వాసులు చాలా దూరం వెళ్ళి తిరిగి రావాల్సిన వస్తోందన్నారు. యు టర్న్ మూసి వేయడం రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఇక్కడ ప్రమాదాలు జరగలేదని, ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా ఇక్కడ యు టర్ను మూసి వేశారని చెప్పారు.

అమెరికన్ ఆసుపత్రి దగ్గర ఉన్న వంతెన విస్తరించడంతో పాటుగా రోడ్డు విస్తరించడం వల్ల ప్రమాదాలు జరగకుండా చూడవచ్చునని చెప్పారు. స్థానికులు ఇక్కడ రోడ్డు దాటే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అప్పడే ప్రమాదాలు జరగకుండా చూడగలమని చెప్పారు.

జాతీయ రహదారిపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అందువల్ల భారీ వాహనాలు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రోడ్డు విస్తరణ గురించి అధికారులతో కమీషనర్తో మాట్లాడతానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ప్రజల కోరిక మేరకు ఇక్కడ యుటర్న్ ఉండేలా అధికారులతో తాను మాట్లాడతానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ తెదేపా అధ్యక్షులు మోటేపల్లి చిన్నా, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, అడపా శేషు, గొరిపర్తి నామేశ్వరరావు, గుద్దటి జయకుమార్, కొడాలి సాయిబాబు, చింత వెంకటేశ్వరరావు, గోగుల రమేష్, వేముల దుర్గారావు, పలిశెట్టి అన్నారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE