మల్లాదితోనే ఉగాది!

నరున్ని..నారాయనున్ని
కలుపుతూ..
షడ్రుచులను కలగలుపుతూ..
మనిషి..మనిషిలో భక్తిభావం
మేల్కొలుపుతూ ప్రవచనాలు చెప్పిన రుషి..
కలికాలపు మహర్షి..
ఉగాదికి ఆయన
స్వరంతోనే ఆది..!

ఉగాది ఉషోదయ వేళ..
ఆ గళం సుమంగళం..
రేడియోలు రాకమునుపే..
టివిలు పుట్టక ముందే..
మల్లాది వారి పంచాంగశ్రవణం..
ప్రతి ఇంటా నిత్యం
సిరుల శ్రావణం!
ఇప్పుడు ఇంటర్నెట్ కాలంలో సైతం యూట్యూబులో
కుర్రకారు ట్యాబుల్లో..
రౌండ్ టేబుల్లో
పెద్దాయన ప్రవచనమే..
అలా తరగని కీర్తికి
చంద్రశేఖరుడు బహువచనమే!
అసలు మల్లాది అంటేనే ఉగాది..
ఆయన అంతరంగమే
వేదవేదాంతాల అంతర్వేది!

తెలియని విషయం ఉందా
ఎరగని శాస్త్రం కలదా..
గ్రహాల గతులు…
వాటిని అనుసరించి మానవుల పుట్టగతులు..
ప్రభువుల..
భృతుల స్థితిగతులు..
ఆయన ఇట్టే ఎరిగిన సంగతులు..!

ఆయన లాలాజలం
సకల వేదాలను నిండి నిభిడీకృతం చేసుకున్న గంగాజలం..
ప్రసంగాల వ్యాసంగాలతో
ఆయన కీర్తి
ప్రసరించింది ఆసేతుహిమాచలం!
అలాంటి ఓ మనిషి…
ఆయన పంచాంగం.. వేదవేదాంగం..
ఆయనే లేకున్నా
దివ్యలోలాల నుంచి
ఆయన వచనం..
ఆశీర్వచనం..
సదా రక్ష..!

మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటూ
శతసహస్ర ప్రమాణాలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286