లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ని ఆహ్వానించిన మందకృష్ణ మాదిగ
హైదరాబాద్: ఫిబ్రవరి 7న హైదరాబాద్ నగరంలో నిర్వహించబోయే లక్ష డప్పులు – వేల గొంతులు కార్యక్రమానికి రావాల్సిందిగా మందకృష్ణ మాదిగ, కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్, మంద కృష్ణ మాదిగ కి పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతి ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉంటామని. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు వెలుబడిన వెంటనే దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో వర్గీకరణ చేపడాతాం అని ప్రకటించారని, దానికి అనుగుణంగానే ప్రభుత్వంతో వర్గీకరణ చేయించే బాధ్యత తనదే అని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత డాక్టర్ ఏ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. లక్షల డప్పులు లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయబోతున్నది అని ఫిబ్రవరి 7న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి లక్షలాది మంది స్వచ్ఛంద తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.