– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి
హైదరాబాద్: అనారోగ్యంతో న్యూఢిల్లీ ఎయిమ్స్ లో మృతి చెందిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, ప్రజావాణి అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ఏర్పాటుచేసిన సంతాప కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి చిన్నారెడ్డి, దివ్య, సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.