Suryaa.co.in

Andhra Pradesh

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

– కాటమనేని భాస్కర్‌కు స్థానచలనం
– పంతం నెగ్గించుకున్న మంత్రి నారాయణ
– సీఎం ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్
– జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ముఖేష్‌కుమార్‌మీనా

అమరావతి: ఐపిఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం, అదే రోజున భారీ స్థాయిలో ఐపిఎస్‌లను బదిలీ చేసింది. 25 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రస్తుతం సీఆర్‌డీఏలో ఉన్న సీనియర్ ఐఏఎస్, నిజాయతీపరుడైన అధికారిగా పేరున్న కాటమనేని భాస్కర్‌ను బదిలీ చేయించడం ద్వారా, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తన పంతం నెగ్గించుకోవడమే ఈ బదిలీలలో విశేషం. కాగా కాటమనేని భాస్కర్‌కు నాలుగునెలల్లో ఇది రెండో బదిలీ.

25 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపి స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్‌ను సిఎం ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రీ డిజిగ్నేట్ చేస్తున్నట్లు, జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. హౌసింగ్ డిపార్టమెంట్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ అజయ్ జైన్‌కు టూరిజం అండ్ కల్చరల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగించారు.

ఎక్స్అఫీసియో చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌కి.. పశు సంవర్ధక, డైరీ, మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. కె సునీతను పబ్లిక్ ఎంట్రర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వాణీ మోహన్‌కు ఆర్కియాలజీ, మ్యూజియం కమీషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

పీయూష్ కుమార్‌ను ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగిస్తూ, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ముఖేష్ కుమార్ మీనాను జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్ సురేష్‌ కుమార్‌ను ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ‌గా బదిలీ చేశారు. సౌరబ్ గౌర్‌ను సివిల్ సప్లైస్ కమిషనర్‌గా నియమించారు. కొన శశిధర్‌ను ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌‌మెంట్‌ కార్యదర్శిగా పూర్తి అదనపు భాద్యతలు అప్పగించారు. కాటమనేని భాస్కర్‌ను ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ కార్యదర్శిగా బదిలీ చేశారు. వీటితోపాటు ఆర్టీజీఎస్, గ్రామ వార్డు సచివాలయాలు కార్యదర్శిగా పూర్తి అదనపు భాద్యతలు అప్పగిస్తున్నట్లు

వి. కరుణను సెర్ప్ సిఇవోగా బదిలీ చేశారు. ఎన్ యువరాజ్‌కు ఐ అండ్ ఐ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎంఎం నాయక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.

ప్రవీణ్ కుమార్‌ను పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. కన్నబాబును సిఆర్డీఏ కమీషనర్‌గా నియమించారు. ఎంవి శేషగిరిబాబును కమిషనర్ లేబర్ డిపార్టమెంట్‌కు బదిలీ చేశారు. ఎస్ సత్యనారాయణను బిసి వెల్పేర్, ఈడబ్ల్యూఎస్ సెక్రటరీగా నియమించారు. వాడ్రేవు వినయ్‌చంద్‌ను రివెన్యూ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.

జి వీరపాండ్యన్‌ను వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, హరినారాయణ్‌ను ఐజి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్‌కు, పీఎస్ గిరీషాను ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండిగా, పి సంపత్ కుమార్‌ను సిడిఎంఏగా బదిలీ చేశారు. వి అభిషేక్‌ను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు అప్పగించారు.

LEAVE A RESPONSE