Suryaa.co.in

Andhra Pradesh

అశోక్ గజపతిరాజుని అవమానించి మంత్రి బొత్స వికృతానందం పొందుతున్నాడు

– అశోక్ గజపతిరాజుని అవమానించడంతోపాటు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మంత్రులను తక్షణమే బర్తరఫ్ చేయాలి
• విజయనగరం జిల్లాకు, అక్కడి ప్రజలకు అశోక్ గజపతిరాజు, ఆయన పూర్వీకులు ఎంతచేశారో ప్రజలకు బాగాతెలుసు
• విజయసాయిరెడ్డి మార్గదర్శకత్వంలోనే, మంత్రి బొత్స , రామతీర్థం ఆలయప్రాంగణంలో అశోక్ గజపతిరాజుని అవమానించారు
– విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున

విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని బోడికొండ రామతీర్థం ఆలయధర్మకర్త, మాజీకేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆలయంలో పునర్మిర్మాణ పనులుజరుగుతున్న సమయంలో ఆలయధర్మకర్త అయిన అశోక్ గజపతిరాజుగారి విషయంలో దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఆలయపనులపేరుతో పార్టీరంగులు వేస్తుంటే రాజుగారు అడ్డుకోవడం జరిగిందని టీడీపీనేత, విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

మాన్సాస్ ట్రస్ట్ నిర్వాహాకులు, రామతీర్థం ఆలయ ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి, సీనియర్ రాజకీయనాయకుడు అయిన అశోక్ గజపతిరాజు ని ఈప్రభుత్వం కావాలనే వేధింపులకు గురిచేస్తోంది. అశోక్ గజపతిరాజుగారు, ఆయన పూర్వీకులు విజయనగరం జిల్లాలో విద్యా సంస్థలు, ఆలయాల

అభివృద్ధికి ఎంతోకృషిచేశారు. వారిభూములను అనేకదేవాలయాలకు ఉదారంగా ఇచ్చేశారు. రామతీర్థంలో రాములవారి సన్నిధిలో మంత్రులు బొత్స సత్యనారా యణ, మరోమంత్రి వెల్లంపల్లి కావాలనే వివాదాలు సృష్టించి వికృతానందం పొందారు. విజయ నగరం జిల్లాలో చాలాసమస్యలున్నాయి. అవేవీ బొత్సగారికి కనిపించడంలేదా అని ప్రశ్నిస్తు న్నాం.

తోటపల్లి బ్యారేజ్ నిర్వహణపనులు గానీ, రైతులసమస్యలు పరిష్కరించాలన్న ధ్యాస గానీ మంత్రి బొత్సకులేకపోవడం సిగ్గుచేటు. జిల్లాలోని రోడ్లుఎలాఉన్నాయి.. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందని మంత్రి ఏనాడైనా పట్టించుకున్నారా? జిల్లాప్రజలు రకరకాల సమస్యలతో అవస్థలు పడుతున్నారు. అవికూడా మంత్రికి, వైసీపీప్రభుత్వానికి కనిపించడంలేదు. విజయసాయిరెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి బొత్ససత్యనారాయణ రామతీర్థం ఆలయంలో కావాలనే వివాదాలుసృష్టించి అశోక్ గజపతిరాజుని అవమానించారు.

అశోక్ గజపతిరాజుని అవమానించడంతోపాటు, హిందువుల మనోభావాలుదెబ్బతీసేలా ప్రవర్తించిన మంత్రులను తక్షణమే ప్రభుత్వంనుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి స్థాయిలోనే అశో క్ గజపతిరాజుని లక్ష్యంగా ఎంచుకున్నారు. వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అశోక్ గజపతి రాజుగారిని వేధింపులకు గురిచేస్తూనేఉన్నారు. రామతీర్థం ఆలయపనులకు సంబంధించి ఏర్పాటుచేసిన శిలాఫలకంలో తనపేరు లేకపోవడాన్ని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. దానికే వైసీపీవారు ఆయనపై భౌతికదాడికి యత్నించారు.

విజయన గరం జిల్లాకోసం, అక్కడిప్రజలకోసం గజపతి కుటుంబీకులు ఎంతచేశారో అక్కడిప్రజలకు బాగా తెలుసు. ఈ ముఖ్యమంత్రి, విజయసాయిరెడ్డి కలిసి, అక్కడి వైసీపీనేతలతోకలిసి, అశోక్ గజపతిరాజు లక్ష్యంగా చేస్తున్నకుట్రలను జిల్లావాసులు గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో సరైన విధంగా వైసీపీప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వారు చెప్పాల్సిన పద్ధతిలో బుద్ధిచెబుతారు.

LEAVE A RESPONSE