* దేవరపల్లి రోడ్డు ప్రమాదంలో రోజువారి కూలీలు 7 గురు మరణించడం అత్యంత బాధాకరం
* బాధిత కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
మంగళవారం రాత్రి దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
లారీ బోల్తా పడిన రోడ్డు ప్రమాదం లో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గము నకు చెందిన రోజువారి కూలీలు 7 గురు మరణించడం అత్యంత బాధాకరమని దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్త విన్న తరువాత నా మనసు కలచివేసిందని, ఈ విషయమై బాధిత కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నానన్నారు. వీరి కుటుంబాలకు భగవంతుడిని మనోధైర్యాన్ని ప్రసాధించాలని ప్రార్థిస్తున్నానన్నారు.
గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జీడిపిక్కల లోడ్‍తో లారీ వెళుతుండగా అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.