విజయవాడ, నవంబర్ 8: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో బుధవారం రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ మర్యాదలతో అధికారులు మంత్రి కొడాలి నానికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ శ్రీ కనక దుర్గ అమ్మ వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అవసరమైన శక్తి యుక్తులను శ్రీ కనక దుర్గ అమ్మవారు ప్రసాదించాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పాలడుగు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని
