250కోట్ల విలువైన దేవాదాయశాఖభూమిపై మంత్రి కొడాలినానీ కన్ను

– అధికారులను బెదిరించి మరీ దేవుడిభూమికి శఠగోపం పెట్టడానికి సిద్ధమైన బూతులమంత్రి.
– మంత్రి మెప్పుకోసం, తప్పుచేస్తే అధికారులు జైలుకెళ్లడం ఖాయం.
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
రాష్ట్రప్రభుత్వానికి రాజ్యాంగమంటే గౌరవం, దేవుడంటే భయంభక్తి, ప్రజలంటే విలువలేదని, అరాచకాలు దోపిడీతో, రాష్ట్రం మూడుపువ్వులు, ఆరుకాయలతో వర్థిల్లుతోందని, ఆకోవలనే మంత్రి కొడాలినానీ తననియో జకవర్గంలోని దేవాదాయశాఖభూమిని కొట్టేయడానికి సిద్ధమయ్యాడని టీడీపీ అధికారప్రతినిది పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి మొదలు, మంత్రులవరకు ఎక్కడి భూముల కబ్జాచేద్దాం.. రాష్ట్రం మీదుగా ఎంతడ్రగ్స్ ను ఎటుసరఫరాచేసి, ఎన్నివేలకోట్లు పోగేసుకుందామనే ఆలోచనల్లో మునిగితేలుతున్నారని మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకోసం ప్రజలను భయపెట్టడానికి, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడాని కూడా అధికారపార్టీనేతలు వెనుకాడటం లేదన్నారు. దోపిడీ, అరాచకాలతో సంపాదించిన సొమ్మతోనే వచ్చేఎన్నికల్లో గెలవాని ప్రభుత్వపెద్దలుచూస్తున్నారుతప్ప, దేవుడు, ప్రజలనే ఆలోచ న వారికి ఏమాత్రం లేకుండాపోయిందన్నారు.
రాష్ట్రంలో బూతులమంత్రిగా ప్రసిద్ధిపొందిన కొడాలినానీ వేషధారణచూడ టానికి జోకర్ లాఉన్నాకూడా, ప్రజలకుఏమాత్రం అనుమానంరాకుండా కోట్లాదిరూపాయలను ఎలాపోగేసుకోవాలన్న ఆలోచనల్లోనే అతను ముని గితేలుతున్నాడన్నారు. దేవుడంటే భక్తిభయం ఉన్నాయనిచెప్పుకునే నానీ, సదరు దేవుడిభూమికే ఎసరుపెట్టాడని మాణిక్యరావు స్పష్టంచేశారు. ఏడాదిలో ఆరునెలలు గుండుతో ఉంటానని చెప్పుకునే నానీ, ఆఖరికి తనచేతబడి వేషధారణతో దేవుడిభూములకు గుండుసున్నా చుట్టడానికి సిద్ధమయ్యాడన్నారు.
ఆఖరికి నిస్సిగ్గుగా పేదల కడుపునింపాల్సిన బియ్యాన్ని కూడా అక్రమంగారవాణాచేస్తూ కోట్లాదిరూపాయలు దండుకుంటున్ననానీ, అదిచాలదన్నట్లు పేకాట క్లబ్ లుకూడా నిర్వహిస్తున్నాడన్నారు. మంత్రిస్థాయిలో ఉండి పేకాట క్లబ్ లు నిర్వహించడమేంటని ప్రశ్నించినవారితో, దానిలోతప్పేముందని నానీ సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు. ఆ విధంగా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్న నానీకి సంబంధించి మరోకుంభకోణం తాజాగా వెలుగుచూసిందని మాణిక్య రావు చెప్పారు. నానీ నియోజకవర్గ కేంద్రమైన గుడివాడపట్టణ శివార్లలోని పులివర్తి-యల్లయ్యపాలెం గ్రామాల పరిధిలోని 25ఎకరాల దేవాదాయభూమిపై అతనికన్నుపడిందన్నారు. సదరుభూమి ధర ఎకరా రూ.10కోట్ల చొప్పున రూ.250కోట్ల వరకు ఉందన్న మాణిక్యరావు, దాన్నికాజేయడానికి సిద్ధమైన మంత్రి కొడాలినానీ, సదరుబాగోతానికి సం బంధించిన ఫైళ్లను చకచకా ముందుకునడిపిస్తున్నాడన్నారు. తనశాఖ పరిధిలోని అంశాలగురించి పట్టించుకోనినానీ, ఆఖరికి దేవుడిభూమికే శఠగోపం పెట్టడానికి సిద్ధమయ్యాడని, ఆ క్రమంలోనే దేవుడిమాన్యమైన 25ఎకరాలకు ఎన్ వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇవ్వాలని దేవాదాయ శాఖాధికారులను బెదిరిస్తున్నాడన్నారు. మంత్రి ఆదేశించాడనో, లేక బెది రించాడనో తప్పుచేయడానికి సిద్ధమవుతున్న అధికారులు, ఒక్కసారి వారి భవిష్యత్ గురించిఆలోచించుకుంటే మంచిదని మాణిక్యరావు హిత వుపలికారు. దేవాదాయభూమిని కాజేయాలనిచూస్తున్న నానీకంటే ముందే అధికారులే జైలుకెళతారని, తప్పుచేసిన అధికారులను టీడీపీ అంత తేలిగ్గా వదలదని మాణిక్యరావు హెచ్చరించారు. గతంలో విగ్రహాలు ధ్వంసమైనప్పుడు, అంతర్వేదిలో రథం ధగ్ధమైనప్పుడు, విజయవాడ లోని దుర్గమ్మగుడిలో వెండిసింహాలు మాయమైనప్పుడు నానీ చాలా హేళనగా, హిందూమతాన్నికించపరిచేలా మాట్లాడాడన్నారు. ఆవిధంగా దేవుడిపై భయంభక్తిలేని నానీ, 25ఎకరాల దేవుడిమాన్యాన్ని స్వాహా చేయడానికి సిద్ధమయ్యాడన్నారు. పులివర్తి-యల్లయ్యపాలెం గ్రామాల పరిధిలోని సర్వేనెం-252లో ఉన్న 15ఎకరాలు, సర్వేనెం-294లోని 5.96 ఎకరాలు, సర్వేనెం-4లోని 4.83ఎకరాలదేవాదాయభూమిపైనానీ కన్నుపడిందన్నారు. సదరుభూమి కబ్జాచేయడానికిప్రయత్నిస్తున్నారని అధికారులు గతంలో చెప్పినవెంటనే, టీడీపీప్రభుత్వందాన్ని గతంలో నిషేధితభూముల జాబితాలో చేర్చిందన్నారు.
సదరుభూమి దేవుడి మాన్యంగానే ఉండేలా 2017లో సెక్షన్ 10లోచేర్చి, దాన్నిఎవరూ కొనకుండా, అమ్మకుండా చేయడంజరిగిందన్నారు. ఆనాడు టీడీపీప్రభు త్వం అలాచేయబట్టే, ఆభూమి నేటికీ భద్రంగాఉందన్నారు. దానిపై కన్నే సిన బూతులమంత్రి నేరుగా దేవాదాయశాఖాధికారులను బెదరిస్తూ, తానే స్వయంగా వారిచుట్టూ తిరుగుతున్నాడని మాణిక్యరావు స్పష్టం చేశారు. తనమంత్రి ఎప్పుడుపోతుందోనన్న భయంతోనే నానీ ఈస్థాయిలో కబ్జాలకు, దోపిడీకి పాల్పడుతున్నాడని టీడీపీనేత తేల్చిచెప్పారు.
ఇప్పుడు అధికారంలోఉన్నాం కదాఅని, నానీఏంచేసినా చెల్లుబాటు అవుతుందని, కానీ దేవుడితో పెట్టుకుంటే, అతను తగినమూల్యం చెల్లించు కొనే తీరుతాడని మాణిక్యరావు తీవ్రస్వరంతోహెచ్చరించారు. దేవాదాయ శాఖాధికారులు నానీ మెప్పుకోసం తప్పుచేయాలనిచూస్తే, వారు జైలుకె ళ్లడంఖాయమన్నారు. అధికారులుసదరుభూమిని దేవాదాయశాఖ పరిధి లోఉంచితే అదివారికే మంచిదని మాణిక్యరావు తేల్చిచెప్పారు.

Leave a Reply