Suryaa.co.in

Telangana

మంత్రి పువ్వాడ, పోలీసులు- నాయకులపై హత్య కేసు నమోదు చేయాల్సిందే

-మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గు చేటు
-సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలవల్లే కేసు నమోదు చేయడం లేదు
-బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్త లేదు
-సాయి గణేష్ సంతాప సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…

ఖమ్మం జిల్లాలో స్థానిక మంత్రి, పోలీసులు, టీఆర్ఎస్ గూండాల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా బాధ్యులపై హత్యా యత్నం కేసు నమోదు చేయాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు కసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు.

బాధ్యులను ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కండ కావరంతో అడ్డగోలుగా వ్యవహరిస్తూ అమాయకులు ఆత్మహత్య చేసుకునేలా బెదిరింపులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతల అంతు చూస్తామని హెచ్చరించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 4వ రోజు పాదయాత్ర శిబిరం వద్ద సాయి గణేష్ చిత్రపటానికి బండి సంజయ్ సహా బీజేపీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. సాయి గణేష్ మృతిపట్ల సంతాప సూచికంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

నమ్మిన సిద్ధాంతం కోసం తెగించి కొట్లాడే కార్యకర్త సాయి గణేష్చట్టానికి లోబడి పాలకుల అక్రమాలు, దుర్మార్గాలపై న్యాయ బద్దంగా యుద్దం చేసిన యువకుడు గణేష్.అలాంటి యువకుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. సాయిగణేష్ పోరాటం మరువలేనిది.

టీఆర్ఎస్ నేతలు గూండాయిజానికి పోలీసుల కండకావరానికి బలైన పోయిన సాయి గణేష్.నిరుపేద సామాన్య కార్యకర్త, తల్లిని పోషిస్తూ కష్టపడి పనిచేస్తున్న యువకుడు.సాయి గణేష్ మరో పేద అమ్మాయితో వివాహానికి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లికి రమ్మంటూ నాకూ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది.

టీఆర్ఎస్ నేతలు, జిల్లా మంత్రి బీజేపీని చూసి భయపడుతున్నరు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నరు. రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నరు. సీఎం ఆధేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు కండ కావరమెక్కి వ్యవహరిస్తున్నరు
ఆత్మహత్యలకు ప్రేరేపించేలా దారుణాలకు ఒడిగడుతున్నరు.సాయిగణేష్ పై ఏకంగా 16 నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు సిద్ధమైండ్రు. పాలకుల అక్రమాలు, టీఆర్ఎస్ నేతల గూండాయిజాన్ని ప్రశ్నించడమే సాయి గణేష్ చేసిన పాపం..

కేసీఆర్… నీకూ భార్యాపిల్లలున్నరు. నీ మూర్ఖత్వపు, దగుల్బాజీ ఆలోచనలవల్ల రైతులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగుల రక్తం తాగుతున్నరు. ఇంకెంత మంది రక్తం తాగితే కడుపు చల్లబడుతుందో ?సీఎంను, పోలీసులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు… బీజేపీ కార్యకర్తల, యువకుల శోకానికి ఫలితం అనుభవించక తప్పదు.

చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే భిన్నంగా వ్యవహరిస్తున్నరు.మరణ వాంగ్మూలం ఆధారంగా ఎందుకు కేసు నమోదు చేయడం లేదు? స్పష్టం చేయాలి.మరణ వాంగ్మూలం తీసుకుంటే మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందనే భయంతోనే పోలీసులు కేసు నమోదు చేయడం లేదు.

సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారు.తక్షణమే మంత్రి, పోలీసులపై హత్యా యత్నం కేసు నమోదు చేయాల్సిందే. బీజేపీ లీగల్ టీం ఈ దిశగా న్యాయ పోరాటం చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టబోం. కచ్చితంగా శిక్షిస్తాం…

 

LEAVE A RESPONSE