అమరావతి : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతిని తెలిపారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరెంటెండెంటుకు చరవాణి ద్వారా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిసి వేసింది అన్నారు. ఫోరెన్సిక్ వైద్యులు ఘటన స్థలానికి వెళ్లారని, ప్రమాద సంఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.
భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్తానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయని,చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి సుభాష్ తెలిపారు.