Suryaa.co.in

Andhra Pradesh

పేటలో ప్రభుత్వ యంత్రాంగం ప్రక్షాళనకు అరవింద బాబు శ్రీకారం

-రైతుని రాజు చేసేలా వచ్చే ఐదేళ్ల పాలన
-రైతును దగా చేసిన జగన్ రెడ్డికి రైతులే గుణపాఠం చెప్పారు

నరసరావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేసేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, కాంప్లెక్సులు, ఇతర రంగాల పై అధికారులతో సమీక్షించారు.

అనంతరం పలు ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమం కొరకు రెగ్యులర్ గా భూసార పరీక్షలు నిర్వహించమని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులోని నూతన వాటర్ ట్యాంకర్ ద్వారా ఎస్ ఆర్ కే టి కాలనీ, పరిసర ప్రాంతాలుకు త్రాగు నీటి సరఫరా వేగవంతం చేయాలని సూచించారు. మార్కెట్ యార్డు, కమర్షియల్ కాంప్లెక్స్ షాపులు నుండి వెంటనే అద్దె బకాయిలు వసూలు చేయాలని,నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అగ్రిమెంట్ టైం పూర్తి అయినప్పటికీ షాపులు అప్పగించని వారిపై తగు చర్యలు తీసుకొని ఆదేశించారు.

మార్కెట్ యార్డు నూతన ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణం, గోడౌన్స్ రిపేర్లు చేయించి రైతులకు ఉపయోగపడే విధంగా పనులు పూర్తి చేయమని ఆదేశించారు.రైతుల తర్వాతనే ఎవరైనా అన్నారు.రైతు సుభిక్షంగా ఉన్న రోజు మాత్రమే రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరుగుతుందని,వారికి గిట్టుబాటు ధరలు కల్పించి,పంటలు అమ్ముకోవడానికి మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి,ఏ.డి.ఎం సూర్యప్రకాశ్ రెడ్డి,మార్కెట్ సెక్రెటరీ ఆంజనేయులు,మున్సిపల్ డి.ఈ శ్రీనివాసరావు,రాష్ట్ర గోల్డ్ బులియన్ మర్చంట్ అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు కడియాల రమేష్,బొడ్డపాటి పేరయ్య,మాజీ కౌన్సిలర్లు వాసిరెడ్డి రవి,కొట్టా కిరణ్,కొవ్వూరు బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE