సీతారామచంద్ర స్వామివార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే ఈటల

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.హుజూరాబాద్ ఎన్నికల్లో ధర్మం గెలిస్తే, న్యాయం నిలబడితే, కెసిఆర్ అహంకారం ఓడిపోతే భద్రాద్రి శ్రీరాముని సన్నిధిలో పూజలు చేస్తామని వేలాదిమంది మొక్కుకున్నారు. ఆ మొక్కులు ఈ రోజు చెల్లించుకున్నం.సమ్మక్క సారక్క కూడా మొక్కు చెల్లుంచుకుంటాం.
ఈ గడ్డ మీద ఉన్న ఎంతో మంది ధర్మం నిలబడాలి అని, న్యాయాన్ని కోరేవాల్లు, ప్రజాస్వామ్యం నిలబడాలి అని కాంక్షించే వారు ఎన్నో మొక్కులు మొక్కారు. వారందరూ చెల్లించుకుంటున్నారు. ఇల్లందకుంట రాములవారి దేవాలయం నుండి తిరుమలకు 950 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు.
నా కోసం మొక్కుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరికీ నా కృతజ్ఞతలు.
ఏ నమ్మకం, విశ్వాసం నా మీద ఉంచారో, ఏ బాధ్యత నా భుజాలమీద పెట్టారో  దాన్ని నెరవేరుస్తాను, మీ బిడ్డగా ఒదిగి ఉంటాను అని, నోట్లో నాలుక లెక్క ఉంటాను, మీ ఆశయాల సాధనకోసం ముందుకు వెళ్తాను అని హామీ ఇస్తున్నా.నిబద్ధతతో ముందుకు న్యాయంగా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కావలసిన ధైర్యాన్ని అందించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.