గంజిప్రసాద్ హత్యోదంతంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావే ప్రధాన నిందితుడు

-తన దోపిడీకి అడ్డొస్తున్నాడనే గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారివెంకట్రావు, సొంత పార్టీ నేత గంజిప్రసాద్ ను హత్య చేయించాడు
– నియోజకవర్గంలో యథేఛ్చగా అవినీతికి పాల్పడుతూ, తనను ఎవరూ ప్రశ్నించకూడదన్న అహంకారంతోనే తలారి, జీ.కొత్తపల్లి గ్రామంలో మూడువర్గాలు తయారుచేశాడు.
– ఆయన సృష్టించినవర్గాలే నేడు ఆయనపై దాడికి యత్నించాయి. పచ్చని గోపాలపురం నియోజకవర్గాన్ని ఫ్యాక్షన్ కు కేంద్రంగా మార్చిన వైసీపీఎమ్మెల్యే అందుకుతగిన మూల్యం చెల్లించుకుంటాడు.
• జీ.కొత్తపల్లిలోనేడు జరిగిన వైసీపీనేత గంజిప్రసాద్ హత్యోదంతంలో వైసీపీఎమ్మెల్యే తలారి వెంకట్రావే ప్రధాన నిందితుడు.
• ఆయనపాత్ర, ప్రమేయంతోనే గంజిప్రసాద్ హత్యజరిగిందని జీ.కొత్తపల్లి గ్రామస్తులు చెబుతున్నారు.
• ఎమ్మెల్యేపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదుచేసి, అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
• సొంతపార్టీ ఎమ్మెల్యే తలారి అవినీతిపై ముఖ్యమంత్రి తక్షణమే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.
– మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తీసుకొచ్చారని, ఈప్రభుత్వంగానీ, స్థానికప్రజాప్రతినిధులు, మంత్రులుగానీ టీడీపీపై, ఆపార్టీనేతలు, కార్యకర్తలను వేధించడం, అంతంచేయడంపై పెట్టినశ్రద్ధలో సగమైనా ప్రజాసంక్షేమంపై, వారివారి నియోజకవర్గాల అభివృద్ధిపై పెట్టిఉంటే ఇలాంటిపరిస్థితి ఉత్పన్న మయ్యేదికాదని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్, మాజీఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు.శనివారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

పూర్వంలో ఎప్పుడో ఉమ్మడిరాష్ట్రంలో రాయలసీమప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు, నరికి చంపు కోవడాలుచూశాము. అలాంటి సంస్కృతిని మరలా ఇప్పుడువైసీపీప్రభుత్వంలో చూడాల్సి రావడం.. అది కూడా ప్రశాంతతకు, పచ్చదనానికి ఆలవాలమైన పశ్చిమగోదావరి జిల్లాలో తీసుకురావడం నిజంగా బాధాకరం. పశ్చిమగోదావరిజిల్లాలోని గోపాలపురం నియోజకవర్గం నుంచి గతఎన్నికల్లో అధికారపార్టీనుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలారి వెంకట్రావు ఆదినుంచి వివాదాలకు కేంద్రబిందువుగానే నిలుస్తున్నారు. ప్రజాప్రతినిధిగాఉండి అందరినీ సమానంగా చూడాల్సిన వ్యక్తి, తనవర్గం.. తన మనుషులు అంటూ విభజించి పాలించడం ప్రారంభించాడు. తనవారు మాత్రమే సంపాదించుకోవాలి.. ఇతరులుఎవరూ ఎదగకూడదని, ప్రతిపక్షంలోనివారితో పాటు, సొంతపార్టీలోని వారిని వేరుచేయడం మొదలెట్టారు. ఏనాడూ ఆయన ప్రజాసమస్యలగురించి పట్టించుకున్నది లేదు.

ద్వారకాతిరుమల మండలం జీ.కొత్తపల్లినేడు హత్యకు గురైన గంజిప్రసాద్ 2012 సహాకార ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అంతకుముందు ఆయన టీడీపీలోనే ఉన్నారు. గంజిప్రసాద్ వైసీపీలో చేరినప్పటి నుంచీ ఆపార్టీకోసం బాగానేపనిచేశారు. 2019లో తలారి వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జీ.కొత్తపల్లిలో గ్రూపురాజకీయాలు మొదలయ్యాయి. మొత్తంగా మూడు గ్రూపులు అయ్యాయి. గత కొంతకాలంగా ఆయాగ్రూపుల్లోని వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు.

తలారి వెంకట్రావు గ్రూపుకుచెందిన వారు గంజిప్రసాద్ పై నేటి ఉదయం దాడిచేసి నరికిచంపారు. అధికారపార్టీఎమ్మెల్యే నేడు ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికిరాగానే మిగిలిన వర్గాలుఆగ్రహావేశాలతో రగిలిపోయాయి. గంజిప్రసాద్ హత్యలో వెంకట్రావు ప్రమేయముందని గ్రామస్థులంతా భావిస్తున్నారు. తలారి వెంకట్రావు ప్రమేయంలేకుండా ప్రసాద్ హత్యజరగలేదని గ్రామంలోనివారంతా ముక్తకంఠంతోచెబుతున్నా రు. కాబట్టి ప్రసాద్ హత్యోదంతంలో ఎమ్మెల్యేని కూడా నిందితుడిగాచేర్చి, ఆయనపై కేసు నమోదుచేయాలని పోలీస్ శాఖను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ప్రసాద్ ను అడ్డుతొల గించుకున్న ఎమ్మెల్యే వెంకట్రావు, హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను రూపమాపడాని కి ఇప్పటికే తనఅధికారాన్ని ఉపయోగిస్తున్నాడని బహిరంగంగానే అందరూచెప్పుకుంటు న్నారు. మంచి నాయకుడిని కోల్పోయామని జీ.కొత్తపల్లి గ్రామస్థులంతా కన్నీరుమున్నీరు అవుతు న్నారు. పంచాయతీ తీర్మానాన్నికాదని, అధికారులపై ఒత్తిడితెచ్చిమరీ, ఎమ్మెల్యే వెంకట్రా వు జీ.కొత్తపల్లిలోని తనమనుషులకు 10ఎకరాలప్రభుత్వభూమిని ఒకఫ్యాక్టరీకోసం అంటూ ఇప్పించాడు. అప్పటినుంచే ఆగ్రామంలో గ్రూపురాజకీయాలు మొదలయ్యాయి.

పోలవరం కాలువకు సంబంధించిన 50ఎకరాల భూమిని కూడా ఎమ్మెల్యే తలారివెంకట్రావు తన వర్గం వారికి కట్టబెట్టేశాడు. టీడీపీహయాంలో నీరు-చెట్టుపథకం కింద చెరువులుబాగుచేసి, గ్రావెల్ మట్టిని రైతులకు, గ్రామాలకు అందించడంజరిగింది. కానీ వెంకట్రావు హయాంలో అక్రమంగా మట్టి, గ్రావెల్ అమ్మకాలు మొదలయ్యాయి. ద్వారకాతిరుమల మండలంతోపాటు, నల్లజెర్ల మండలంనుంచి నిత్యం వందలాదిలారీల గ్రావెల్..మట్టి యథేచ్ఛగా తరలిపోతోంది.

గోపాలపు రం మండలంలో దాదాపు 35ఏళ్లనుంచిపేదలు సాగుచేసుకుంటున్న 35ఎకరాల ప్రభుత్వభూ మిని ఎమ్మెల్యే తన అల్లుడితో కబ్జాచేయించడానికి ప్రయత్నించాడు. ఆసమయంలో గోపాల పురం వెళ్లి నేను అధికారులతో మాట్లాడితే, అప్పుడు ఎమ్మెల్యేవెనక్కుతగ్గాడు. ముఖ్యమంత్రికి గుడికడతానంటూ సొంతపార్టీవారిని మోసగించాలని కూడా ఎమ్మెల్యే ప్రయ త్నించాడు. తన అవినీతినిప్రశ్నించారని, సొంతపార్టీ వారినికూడా వదలకుండా వెంకట్రావు దాడులుచేయించాడు.

ఎన్ ఆర్ ఈజీఎస్ నిధుల్ని కూడా తనఅవినీతికోసం స్వాహాచేసిన ఎమ్మెల్యే, చెరువులు, గట్లు బాగుచేసేనెపంతో నియోజకవర్గానికి కేటాయించిన ఎన్ఆర్ఈజీఎస్ నిధుల్లో దాదాపు 20శాతం నిధుల్ని కాజేశాడు. ఈ మధ్యకాలంలో నల్లజర్ల గ్రామంలో స్వర్గీయనందమూరి తారకరామారావు గారి విగ్రహావిష్కరణకు వచ్చిన టీడీపీనేత లు, మాజీమంత్రులపై కేసులుపెట్టించాడు. గోపాలపురం నియోజకవర్గం తనఅడ్డా అన్నట్లు గా వ్యవహరిస్తున్న వైసీపీఎమ్మెల్యే వెంకట్రావు.. ఆఖరికి తనతప్పులను ఎత్తిచూపుతున్నారని, అవినీతిని ప్రశ్నిస్తున్నారని, సొంతపార్టీ వారి రేషన్ కార్డులు తొలగించడం… పింఛన్లుకట్ చేయడం లాంటివి చేశాడు.

యువకులు చేసుకునే ప్రైవేట్ ఉద్యోగాలను తీసేయించడం.. నయానోభయానో బెదిరించడం అనేది ఎమ్మెల్యేకి అలవాటుగా మారింది. హోంమంత్రి సొంత జిల్లాలోనేఇలా పట్టపగలు హత్యలుజరిగితే… ఇక రాష్ట్రంలోని ఇతరప్రాంతాల సంగతి ఏమిట ని ప్రశ్నిస్తున్నాను. అధికారపార్టీఎమ్మెల్యేపై సొంతపార్టీ వారే ఆగ్రహంతో దాడికి యత్నించారం టే ఈ ప్రభుత్వపనితీరు, పాలనఎలాఉన్నాయో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యకలాపాలు నానాటికీ ఎక్కువ అవబట్టే, జీ.కొత్తపల్లిలో ప్రజలంతా సామూహికంగా దాడిచేసి స్థానిక ఎమ్మెల్యే కి బుద్ధి చెప్పారు.

కాలువగట్లు తవ్వుకొని మట్టిని, గ్రావెల్ ను అమ్ముకోవడం.. ఇళ్లపట్టాలపేరుతో అవినీతికి పాల్పడటం…ఎన్ఆర్ ఈజీఎస్ నిధులస్వాహా… ఎమ్మెల్యే తలారి వెంకట్రావుచేసిన అవినీతిపై స్వతంత్రసంస్థతో దర్యాప్తుజరి పించాలని ముఖ్యమంత్రిని టీడీపీతరుపున డిమాండ్ చేస్తున్నాం. గంజిప్రసాద్ హత్యతాలూ కా సాక్ష్యాలు, ఆధారాలను మాయంచేయించే పనిలో ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావుపై ఎఫ్ఐఆర్ నమోదుచేయించి, వెంటనేఅరెస్ట్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. పరిపాలనముసుగులో ప్రభుత్వం, వైసీపీఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతితోప్రజలు విసిగిపోబట్టే దాడులకు తెగబడు తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే నేడు జీ.కొత్తపల్లిలో వైసీపీఎమ్మెల్యే ప్రాణభయంతో పరుగులుపెట్టడం.

Leave a Reply