Suryaa.co.in

Andhra Pradesh

ముంపు ప్రాంతంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటన

  • వరద బాధితులకు అండగా ఉంటాం
  • ప్రజలకు నిత్యావసర సరుకులు
  • నీట మునిగిన పంటల పరిశీలన
  • నష్టపోయిన అందరినీ ఆదుకుంటాం
  • ఏపీలో కృష్ణా నదికి ఎన్నడూ రానంత వరద..
  •  ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వీరులపాడు మండలంలో అల్లూరు, పెద్దాపురం,జుజ్జురు,వెల్లంకి గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేశారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. దశాబ్దాల కాలంలో ఇటువంటి విపత్తును ఎన్నడూ చూడలేదన్నారు. సీఎం చంద్రబాబు కార్యదక్షత వల్లే నేడు ముంపు బాధితులు ఈ విపత్తు నుంచి గట్టెక్కారని తంగిరాల సౌమ్య అన్నారు.

అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు వరద సహయక చర్యల్లోనే ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు పది రోజుల పాటు కలెక్టరేట్లోనే ఉండి వరద సహయక చర్యలపై పర్యవేక్షించారన్నారు. వరదల వల్ల అపార నష్టం సంభవించిందన్నారు. లక్షలాది ఇళ్లు నీట మునిగాయని.. మొత్తం వరదల్లో లక్షల మంది ఇబ్బందులు పడ్డారన్నారు.

పంటలు,రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని సౌమ్య పేర్కొన్నారు. ఇంకా ఎన్న్యూమరేషన్ కొనసాగుతోందని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతు, బాధితులకు కూటమి ప్రభుత్వం పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE