Suryaa.co.in

Andhra Pradesh

సహాయక చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యే వసంత

– వరద బాధితులకు కొనసాగుతున్న సహాయక చర్యలు
– గొల్లపూడిలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారి కార్యాలయం నుంచి భారీగా ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు, రొట్టెలు కొవ్వొత్తులు, పెట్టెలు పంపిణీ.

విజయవాడ రూరల్: వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా ఈ సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరుసగా ఆరో రోజు శుక్రవారం నాడు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా నిరాశ్రయులైన వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.

విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీలోని వరద బాధితులకు 30 వేల పాలప్యాకెట్లు, 60 వేల వాటర్ బాటిల్స్, 10 వేల అల్పాహార ప్యాకెట్లను శుక్రవారం ఉదయం పంపిణీ చేశారు.విజయవాడ రూరల్ మండలంలోని మిగిలిన వరద బాధిత గ్రామాల ప్రజలకు 26 వేలు అల్పాహార ప్యాకెట్లు, 10 వేల పాలప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ, రెడ్డిగూడెం, జి.కొండూరు మండలాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిరాశ్రయులకు 15 వేల పాలప్యాకెట్లు, 5వేల బిస్కట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఇవికాక మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేలు మధ్యాహ్న భోజనం ప్యాకెట్లు, 70 వేల కొవ్వొత్తులు, 10 వేల అగ్గిపెట్టెలు, 1200 రొట్టెలు పంపిణీ చేశారు. వీటన్నింటినీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు , ఎన్డీఏ మహాకూటమి నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE