– ప్రజల కష్టాలు చూసి చలించిన వైనం
విజయవాడ: రూరల్ మండలంలోని జక్కంపూడి జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీలో వరదముంపు బారిన పడిన అపార్ట్ మెంట్ నివాసితుల కష్టాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు.
జేసీబీలో వెళ్లి వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో బాధితుల దగ్గరకు వెళ్లి, వారి ఇబ్బందులు అడిగి తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారించారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టలను పంపిణీ చేయించారు. ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు పుష్కలంగా అందజేశారని పలువురు బాధితులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు రోజుల పాటు దాదాపు 50 ట్యాంకర్ల నీటిని సరఫరా చేశామన్నారు. ఇది ఊహించని జలప్రళయమని, బాధితులను ఆదుకోవడానికి మా మానవ ప్రయత్నం మేము చేస్తున్నామని పేర్కొన్నారు.
వరద తగ్గిపోయి, మేమే వంట వండుకుంటాం అనే కుటుంబాలకి రేపటి నుంచి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిపాయలు, 1 కేజీ చక్కెర, 2 కేజీల బంగాళదుంపలు ఇస్తామన్నారు.