Suryaa.co.in

Telangana

పజ్జన్నకు ఎమ్మెల్యేల పరామర్శ

సికింద్రాబాద్ ఇటీవల గుండె పోటుకు చికిత్స పొంది కోలుకున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను సోమవారం మోండా మార్కెట్ లోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు కలుసుకొని పరామర్శించారు. పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహీపాల్ రెడ్డి, హుజురాబాద్ శాసనసభ్యులు పాడే కౌశిక్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు, జీ.హెచ్.ఎం.సీ. అధికారులు పద్మారావు గౌడ్ ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE