– వైసీపీకి సమాధికట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని ఈ ఫలితాలతో తేలిపోయింది
– కుప్పంలో చంద్రబాబు ఓటమిపై మాట్లాడేవారు, పశ్చిమబెంగాల్లో ఓడిపోయి మమతాబెనర్జీనే ముఖ్యమంత్రి అయ్యిందని గ్రహించాలి.
– డీజీపీ వైసీపీ మనిషికాబట్టి, పోలీసులు అధికారపార్టీనేతల మోచేతి నీళ్లుతాగారుకాబట్టే, ఈ విజయం వారికి దక్కింది.
– రాష్ట్ర ఎన్నికలసంఘం పనితీరుపై, వైసీపీ అరాచకాలపై కేంద్రఎన్నికలసంఘానికి ఫిర్యాదుచేయబోతున్నాం.
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
తాజాగా వెల్లడైనఫలితాల్లో వైసీపీది గెలుపా..వాపా అనేది అధికారపార్టీనే తేల్చుకోవాలని, తెలుగుదేశంపార్టీకి ఓట్లు పెరిగాయనే వాస్తవాన్ని ఎవరైనాఒప్పుకోవాల్సిందేనని, ప్రభుత్వం ఎన్ని అరాచకాలు, ఆకృత్యాలు, దారుణాలుచేసినా టీడీపీశాతం పెరిగిందేతప్ప, తగ్గలేదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టంచేశారు. బుధవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
తెలుగుదేశం ఎక్కడైతే పోగోట్టుకుందో, అక్కడే తిరిగి పుంజుకుంది. దీంతో వైసీపీ సమాధికట్టే దిశగా మార్పుమొదలైందని స్పష్టమవతోంది. మాకు ప్రజామోదంఉందని, మేం గెలిచామని జబ్బలుచరుచుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారా యణలు వారి విజయం డీజీపీదని గ్రహిస్తే మంచిది. హోల్ కేబినెట్ మొత్తం డీజీపీనే అభినం దించాలి. జగ్గయ్యపేటలో ఒకవార్డులో 13ఓట్లతో టీడీపీ గెలిస్తే, మూడుసార్లు రీకౌంటింగ్ ఎందుకు జరిపారు.. టీడీపీ గెలిచిందనే కదా? జగ్గయ్యపేటలో వైసీపీతోపాటు, టీడీపీకీ సమానంగాస్థానాలు వచ్చాయని అధికారపార్టీ ఎమ్మెల్యే కౌంటింగ్ కేంద్రంలోకి వెళతారా? దర్శిలో మైనారిటీ వర్గానికిచెందిన వైసీపీ రెబల్ అభ్యర్థిపై దాడిచేశారు.
ముందునుంచీ నామినేషన్లు వేయకుండా బెదిరించడం, వేసిన వారి నామినేషన్లు అధికారులతో చించేయించడం.. పోలీసులతో వారిని నిర్బంధించడం చేశారు. ఇంతదుర్మార్గంగా ఎన్నికలుజరుగుతాయ ని ఎన్నడైనా అనుకున్నామా? గురజాల, దాచేపల్లి, బేతంచర్లలో వందలసంఖ్యలో పోలీసుల్ని దించి, దొంగఓటర్లను బస్సుల్లో దించారు.ఆధారాలతో సహా, టీడీపీ దొంగఓటర్ల ను పట్టుకొని ఎన్నికలకమిషన్ కు ఫిర్యాదుచేస్తే, ఎన్నికలకమిషనర్ గారు ఎక్కడా దొంగ ఓట్లు పడలేదని, అంతా ప్రశాంతంగా జరిగిందని చెబుతున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరి గితే, టీడీపీ ఇచ్చినఫిర్యాదులకు ఆమె ఎందుకు సమాధానంచెప్పడంలేదు? స్థానిక కలెక్టర్లు, జిల్లాఎస్పీలకు ఫిర్యాదుచేయాలని ఎన్నికలకమిషనర్ చెప్పారు. ఎక్కడైనా వారు అందుబా టులోఉంటున్నారా? కుప్పంలో ఓడిపోయామంటున్నారు. పశ్చిమబెంగాల్లో కూడా మమతా బెనర్జీ కూడా ఆమె నియోజకవర్గంలో ఓడిపోయారు. కానీ ఆమె ముఖ్యమంత్రి అయ్యింది కదా..! డీజీపీ మీ సొంతమనిషి కాబట్టి, పోలీసులు మీ మోచేతికింద ఉన్నారుకాబట్టే, దుర్మా ర్గంగా ఎన్నికలుజరిపించారు.
2024ఎన్నికల్లో ఇదేరకమైన ఆటలు సాగిద్దామని ప్రభుత్వం అనుకుంటే కుదరదు. కుప్పంలో ఓడిపోతే, చంద్రబాబునాయుడు గారు దుకాణంమూసేయాలా? దర్శిలోవైసీపీ ఓడిపోయింది కాబట్టి, విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాచేస్తారా?
నిజంగా ప్రజల మద్ధతు మీకే ఉంటే, అసెంబ్లీని ఒక్కరోజుకే ఎందుకుపరిమితం చేస్తున్నారు. సంవత్సరంలో రెండురోజుల అసెంబ్లీ పెడతారా? అసెంబ్లీరెండురోజులుపెట్టి జీతాలు తీసుకుంటున్నందుకు వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు సిగ్గుపడాలి. ఒక్కరోజు అసెంబ్లీ పెట్టడం ఏమిటి సిగ్గులేకుండా, నవంబర్ 19తో ఆరునెల్లసమయం ముగుస్తుందని పెడుతున్నారు తప్ప ప్రజలగురించి కాదు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పడానికి తాజాఫలితాలే రుజువు.
ప్రభుత్వ పతనం మొదలైందని చెప్పడానికి, పాలకులు ఒకరోజు అసెంబ్లీ పెట్టడంకూడా ఒక నిదర్శనం. పాలకులదిగజారుడుతనం అన్నింటిలో స్పష్టంగా కని పిస్తోంది. నెల్లూరులో నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు దిగారు. వేసినవారిని బెదిరించి, 8వార్డులు ఏకగ్రీవం చేసుకున్నారు. కుప్పంలో నామినేషన్లు ఎందుకు తిరస్కరిం చారంటే ఎన్నికల కమిషన్ నుంచి సమాధానంలేదు. ఒకచిన్న పోలీస్ అధికారి చర్యలపై తామ ఫిర్యాదుచేస్తే, అతన్నికూడా ఎన్నికలకమిషన్ బదిలీచేయలేదు. పాలకులు బేలతనం ఈ ఎన్నికల్లో బయటపడింది. కౌన్సిల్ లో మెజారిటీ ఉందంటూనే, సమావేశాల నిర్వహణకు ఎందుకు భయపడుతున్నారు?
గెలుపులో నిజాయితీ, బలముండాలి. 2019లో జరిగిన ఎన్నికలకు, మార్చిలో జరిగిన స్థానికఎన్నికలకు వైసీపీ ఓటింగ్ శాతం పెరిగితే, టీడీపీ ఓటింగ్ శాతం కేవలం 6నెలల్లోనే పెరిగింది. దర్శిలో ఫలితం తారుమారు అయినందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి, కరణం బలరామ్ లు రాజీనామాలు చేయాలి. బొత్స సత్యనారాయణ చంద్రబాబుగారు రాజీనామాచేయాలన్నదానికి తామువిసిరే సవాల్ ఇదే. సజ్జల రామకృష్ణా రెడ్డి గుంటూరు 6వవార్డ్ ని గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నించి భంగపడ్డారు. ఆయన కూడా తననైతికఓటమిని అంగీకరించి సలహాదారు పదవికి రాజీనామాచేస్తారా? ఆకివీడు నుంచి కుప్పంవరకు రాత్రింబవళ్లు ధైర్యంగా నిజాయితీతో పనిచేసి, 80వార్డులు గెలిచేలా పోరాడిన టీడీపీ కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
రాష్ట్ర ఎన్నికలకమిషన్ పై, వైసీపీ అరాచకాలపై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేయబోతున్నాం. అలానే మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలుచూస్తే, జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని అర్థమవుతోంది. ఎన్నికల్లో వైసీపీ దుర్మార్గాలు శాశ్వతంకావు. మంత్రులనువచ్చేఎన్నికల్లో ఎవరూ కాపాడలేరు. ఈ ఎన్నికల్లో అన్నింటికి ఎదురొడ్డి పోరాడిన టీడీపీ కార్యకర్తలకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతు న్నా.