Suryaa.co.in

Andhra Pradesh

వాళ్లను కుక్కలను కొట్టినట్లు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి

కొడాలి నాని, అంబటి రాంబాబు, ద్వారంపూడి ను కుక్కలను కొట్టినట్లు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి
– ఎమ్మెల్సీ బి.టి. నాయుడు
వైసీపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్లను కుక్కలను కొట్టినట్లు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఎమ్మెల్సీ బి.టి. నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం విలేఖరులకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడారు.
కొడాలి నాని, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు తగిన శాస్తి జరుగుతుంది. నందమూరి తారక రామారావు కుమార్తె, ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణలు చేయడం అమానుషం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రాక్షసానందాన్ని ప్రజలు చూశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వీధి రౌడీలు ఏ విధంగా ఉంటారన్నదానికి అసెంబ్లీలో చూసిన సంఘటనే నిదర్శనం.
భువనేశ్వరి బయటికి రాకుండా గౌరవంగా వ్యవహరించేవారు. ఆంబోతు వంటి రాంబాబు, బ్లేడ్ బ్యాచ్ నానీలు భువనేశ్వరి పై దూషణలు చేయడం సిగ్గుచేటు. టీడీపీ వచ్చిన మరుక్షణమే బెజవాడ నడిరోడ్డులో వారిని కుక్కలను కొట్టినట్లు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. రాంబాబును నడిరోడ్డులో బట్టలూడగొట్టి కొడతారు. చంద్రబాబు చిటికేస్తే మీ ఇళ్లన్నీ ధ్వంసం కాగలవు. వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు మేధావులు, ముఖ్యంగా ఆడపడచులు ఆలోచించాలి. 40 సంత్సరాల రాజకీయ జీవితం ఉన్న నాయకుడి సతీమణీ మీద దూషణలు చేయడం ఎంతవరకు న్యాయం?
శాసనసభలో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం ఎక్కడ చర్చకు వస్తుందో అని భయపడి ఈ విధంగా వ్యక్తిగత దూషణలు చేశారు. రౌడీలను ఎమ్మెల్యేలుగా చేస్తే ఇలానే ఉంటుందని ప్రజలు ఆలోచించాలి. ఇది చంద్రబాబునాయుడు ఒక్కడిపై జరిగిన అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ జరిగిన అవమానంగా భావించాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఈసందర్భంగా తెలిపారు.

LEAVE A RESPONSE