మంగళగిరి: రత్నాల చెరువు నందు ఎమ్మెల్సీ పర్యటించి భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను, మగ్గాల షెడ్డులను పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోరారు.
అనంతరం ఆయన మీడియా వారితో మాట్లాడుతూ వరదల్లో మరణించిన వారికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పర్యటించిన వారిలో చేనేత విభాగం అధ్యక్షులు గంజి చిరంజీవి , ఎంటిఎంసి వైసిపి అధ్యక్షులు దొంతి రెడ్డి వేమారెడ్డి , స్థానిక వైసిపి నాయకులు ఉన్నారు..