గాల్లో తిరిగే ముఖ్యమంత్రికి రోడ్ల దుస్థితి పట్టవా?

– రోడ్ల మీదే జగనన్న స్విమ్మింగ్ ఫూల్స్ పథకం పెడతారేమో?
– పోవాలి జగన్ కావాలి రోడ్లని ప్రజలు ఫ్లెక్సీలు పెట్టినా ప్రభుత్వానికి సిగ్గు రాదా?
– శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు
రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా నరకపు కూపాల్లా మారాయి. దోచుకోవడం దాచుకోవడం ప్రజాధనం లూఠీ, దుబారా చేయడం తప్పా రోడ్లు వేయాలన్న కనీస జ్ఞానం జగన్ రెడ్డికి లేదు. అసమర్ధ ముఖ్యమంత్రి పాలనలో రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. గాల్లో తిరిగే ముఖ్యమంత్రికి రోడ్ల పరిస్థితి పట్టవా? రోడ్ల దుస్థితి ఇది అని చెప్పుకోలేని స్థితిలో ఆ శాఖ మంత్రి ఉన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ అన్న ప్రజలు నేడు పోవాలి కావాలి రోడ్లు అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఫెక్సీలు పెట్టి మరి ప్రచారం చేయడం దేశంలో మొదటి సారిగా చూస్తున్నాం. వర్షాలు పడితే రోడ్లు, చెరువులు ఏకం అవుతున్నాయి. రోడ్ల పరిస్థితికి త్వరలో జగనన్న స్విమ్మింగ్ ఫూల్స్ అనే పథకం పెడతారేమోనన్న అనుమానం కలుగుతుంది. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రూ.8వేల కోట్లతో

30వేల కి.మీ. రోడ్లు వేశారు. కాని జగన్ రెడ్డి రెండున్నరేళ్ల కాలంలో కేవలం రాష్ట్ర ఖజానాతో రోడ్లకు రూ.15 కోట్లు మించి ఖర్చు చేయలేదు. ముఖ్యమంత్రిని రాబోయే రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేలే అడ్డుకుంటారు. మౌలిక సదుపాయాలు ఉంటేనే కంపెనీలు, పెట్టుబడులు వస్తాయి. అవి వస్తేనే యువతకు ఉద్యోగాలు పెరుగుతాయి. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
రాష్ట్రంలో రోడ్లన్నీ నరకకూపాల్లా మారాయి, ప్రమదాలకు నెలవుగా నిలుస్తున్నాయి. రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. రోడ్ల దుస్థితికి ప్రజల నడుములు విరిగిపోతున్నాయి. ప్రభుత్వం బ్యాంకుల రుణాలను దారి మళ్లించి, కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవడంతో, రోడ్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
గత ప్రభుత్వ హయాంలో అయిన పనులకు జగన్ రెడ్డి ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా బిల్లులు పెండింగ్ లో పెట్టారు. ప్రభుత్వం 403 పనులకు గాను టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ రెండేళ్లలో రూ.1200 కోట్లు రోడ్‌ సెస్‌ రూపంలో జనం నుంచి వసూలు చేసింది. ఆ డబ్బులను రోడ్ల కోసం ఖర్చు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేదే కాదు.

Leave a Reply