ప్రపంచ దేశాల నేతలకు బాస్ లా మోడీ

-పది కోట్ల మందికి ఉచితం గా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం
-ఏపీ కి ప్రత్యేక నిధులు, పదివేల నాలుగు వందల కోట్లు
-ఆంధ్ర ప్రదేశ్ కు 55 వేల కోట్ల రూపాయల నరెగ నిధులు…22 లక్షల ఇళ్లు మంజూరు
-రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు

ఈరోజు బ్రాడీపేట లోని గ్రాండ్ నాగార్జున హోటల్ నందు పాత్రికేయుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విచ్చేశారు. ఈసందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ…మోదీ ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి. జగన్ ప్రజా సంక్షేమం పేరుతో సంక్షోభం. కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమం చేస్తూ దేశ మౌలిక సదుపాయాల కల్పన, దేశ రక్షణ , విద్యా, వైద్యం, ఉద్యోగ కల్పన , స్వావలంబన భారత్, మేడిన్ ఇండియా, ఉద్యోగ కల్పన ఇలా సంక్షేమంతో పాటు అభివృద్ధి అనే లక్ష్యంగా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం పాలు చేస్తున్నారు.

బీజేపీ దేశంలో 9సం. సుపరిపాలన పూర్తి చేసుకున్న సంధర్భంగా ప్రజలకు దానిని చేరవేయడమే లక్ష్యం గా పనిచేస్తున్నాం.బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విజయాలు సాధించాం.గత 65సం.ల కాలంలో ఎవరు చేయని అభివృద్ధి పనులు చేశాం.ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ చాటుకోవడం మోడీ పాలనకు నిదర్శనం.రక్షణ రంగంలో భారత్ ముందంజలో ఉంది…

వ్యాక్సిన్ మిత్ర పేరుతో 220 కోట్లకు పైగా తయారుచేసి ప్రపంచ దేశాలకు అందించిన పేరు భారత్ దక్కడం గమనార్హం.ప్రపంచ చరిత్రలో 13ఎకరాల విస్తీర్ణంలో 900లకోట్ల ఖర్చుతో పార్లమెంట్ నిర్మించి చరిత్రకెక్కారు.10 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించిన నేత.

వచ్చే ఎన్నికల్లో కూడా భారత దేశంలోమోడీ ప్రభుత్వం విజయ దుందుభి మోగించనుంది.భారత్ లో తీవ్రవాద కళాపాలకు స్వస్తిపలికి శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టించారు…ఇటలీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులు ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేయగల వ్యక్తి నరేంద్ర మోడీ అని అనడం గమనార్హం.

గత 9సం.లలో నరేగా నిధులు 55వేల కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడం జరిగింది.టీడీపీ మ్యానిఫెస్టో వారి పార్టీ సొంత అభిప్రాయం. దాని గురించి మేము మాట్లాడటం సరికాదు ప్రజలే నిర్ణయిస్తారు.గత తొమ్మిదేళ్ళ లో 74 కొత్త ఎయిర్పోర్ట్ లను నిర్మించాం.55 వేల కోట్ల రూపాయల నరెగ నిధులను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చాం.22 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగింది.ఏపీ కి ప్రత్యేక నిధులు ఇచ్చారు.పదివేల నాలుగు వందల కోట్లు ఏపీ కి ఇచ్చి కేంద్రం తన ఉదారతను చాటుకుంది.

ప్రపంచ దేశాల నేతలకు బాస్ లా మోడీ మారారు.2014 లో బలహీనమైన దేశాల జాబితాలో ఉండేది.మోడీ నాయకత్వం లో ప్రపంచంలో ఐదవ బలమైన దేశం గా ఎదిగింది. నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలన సుభిక్షంగా జరిగింది.ఆరున్నర దశాబ్దాల లో భారత దేశం సాధించలేని అద్భుతాలు విజయాలు మోడీ ప్రభుత్వం సాధించింది.కరోనా సమయం లో ఆత్మ నిర్భర భారత్ ద్వారా మన సత్తా చూపించాం..ప్రపంచానికి మేడ్ ఇన్ ఇండియా వాక్సిన్ అందించాం.

మొబైల్ ఫోన్ ల తయారీ లో ప్రపంచం లో రెండవ దేశం గా ఎదిగింది.కోవిడ్ సమయం లో వంద దేశాలకు మందులు అందించిన ఘనత మోడీ ప్రభుత్వానిది.ఈ దేశంలో వాక్సిన్ తయారు అవ్వక పోతే కొన్ని కోట్ల ప్రాణాలు ప్రమాదం లో పడేవి.రెండున్నరేళ్ల లో పార్లమెంట్ ఉభయ సభల భవనాలను నిర్మించిన చరిత్ర మోడీ నాయకత్వనిది. పది కోట్ల మందికి ఉచితం గా గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చాం.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ ఖాయం. తీవ్రవాద చొరబాట్లు దాడులను అరికట్టిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం.కోవిడ్ సమయం లో ,యుద్ధ సమయంలో విదేశాల నుండి ప్రజలని రక్షించి తీసుకు వచ్చిన ప్రభుత్వం మోడీ ది. సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తోట రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, కార్యవర్గ సభ్యుడు శిరసనగండ్ల శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు మంత్రి సుగుణ, ఈమని మాధవరెడ్డి, గాజుల వెంకయ్య నాయుడు, భీమినేని చంద్రశేఖర్, వనమా నరేంద్ర, కుమార్ గౌడ్, అప్పి శెట్టి రంగారావు, రాచమల్లు భాస్కర్, గారపాటి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply