ఎంపీ కేశినేనికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు

Spread the love

రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెదేపా అధినేత చంద్రబాబు ఇన్‌ఛార్జ్లను ఖరారు చేశారు.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కో-ఆర్డినేటర్గా ఎంపీ కేశినేని నానిని నియమించారు.బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జీ పదవిని ఆశించినప్పటికీ.. వారికి దక్కలేదు.
రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెదేపా అధినేత చంద్రబాబు ఇన్‌ఛార్జ్లను ఖరారు చేశారు. రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శిగా చిరుమామిళ్ల మధుబాబు, విశాఖ సౌత్ ఇన్ఛార్జ్గా గండి బాబ్జీ, మాచర్ల ఇన్చార్జీగా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని నియమించారు.

విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ గా కేశినేని నాని
సర్వత్రా ఆసక్తి నెలకొన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవిపైనా.. తెదేపా స్పష్టతనిచ్చింది.ఎంపీ కేశినేని నానికి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు.. విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ పదవిని ఆశించినప్పటికీ.. వారికి అవకాశం దక్కలేదు.

వారిద్దరూ ఇప్పటికే వేర్వేరు బాధ్యతల్లో ఉండటంతో.. ఈ నియోజకవర్గం బాధ్యతలను నానికి అప్పగించారు. అదేవిధంగా నియోజకవర్గంలో డివిజన్ స్థాయి కమిటీలను నియమించుకునేందుకు కేశినేని నానికి అధిష్ఠానం స్వేచ్ఛనివ్వడంతోపాటు.. ఇప్పటికే బుద్దా, నాగుల్ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని సూచించింది.

Leave a Reply