విశాఖలో శృంగారపీఠం, పల్నాడులో చిలిపి పీఠం, ఇక రాయలసీమలో మరొక శృంగార పీఠం

-మూడు ప్రాంతాలలో తమ పార్టీ నేతలు శృంగార పీఠాలను ఏర్పాటు చేశారు
-ఒకరు పల్నాటి పులి , మరొకరు విశాఖ వీరుడని, ఇంకొకరు రాయలసీమ సింహం
-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పర్యాయపదం పెట్టిన నెటిజన్లు
-పెద్దాయన పేరు పెట్టుకున్నాం … ఎంతో బాధనిపిస్తుంది
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

యువజన రైతు శ్రామిక పార్టీ (వైయస్సార్ ) కి, గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పర్యాయపదం పెట్టి పిలుస్తున్నారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే యో, శృంగార , రసిక, చిలిపి పార్టీ అని సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజుల నుంచి ట్రోల్ చేస్తున్నారన్నారు. పార్టీకి పెద్దాయన పేరు పెట్టుకున్నామని, కానీ ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి లభించకపోవడంతో, యువజన రైతు శ్రామిక పార్టీగా నామకరణం చేశామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను
ఇవ్వకుండా యువకులను, ఇక రైతులను, శ్రామికుకు అందర్నీ నిండా ముంచామన్నారు.

రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు ఎలాగూ జరగదని, కానీ మూడు ప్రాంతాలలో తమ పార్టీ నేతలు శృంగార పీఠాలను ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ఒకరు పల్నాటి పులి కాగా, మరొకరు విశాఖ వీరుడని, ఇంకొకరు రాయలసీమ సింహం అని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖలో శృంగారపీఠం, పల్నాడులో చిలిపి పీఠం, ఇక రాయలసీమలో మరొక శృంగార పీఠము ఏర్పాటు చేయడం జరిగిందని అపహాస్యం చేశారు. మహిళలతో మాట్లాడే విషయంలో ఒకరు ప్లిజింగ్ గా, మరొకరు ఫీడింగ్ గా, ఇంకొకరు ఫోర్సబుల్ గా మాట్లాడారని అన్నారు. అయితే వీడియో వెలుగులోకి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటే, ఆడియోలో దొరికిపోయిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోరనే ప్రశ్న కలిస్తే అవకాశం ఉన్నదని చెప్పారు. వీడియో తో పాటు, ఆడియో టేపుల పైన విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

పెద్దల పేర్లు వెలుగులోకి వచ్చే ఛాన్స్
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటే, పెద్ద పదవుల్లో ఉన్న ఉన్నవారు మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే ప్రమాదం ఉన్నదని రఘురామకృష్ణం రాజు అన్నారు. చర్యలు తీసుకునే ముందు సకల శాఖ మంత్రి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎందుకంటే తమ పార్టీ రెడ్లకు టికెట్లను ఇచ్చినప్పటికీ, బీసీ పార్టీగా చెప్పుకుంటామన్న ఆయన, ఒక బీసీ పై చర్య తీసుకున్నామన్న అపవాదు రాకుండా జాగ్రత్త పడాల న్నారు. ప్రముఖుల వీడియోలు మరో మూడు నాలుగు వెలుగులోకి వస్తాయి రెడీగా ఉండాలని, తమ పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన వ్యక్తి వెల్లడించారని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. తన వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నా, ఆసుపత్రిలో ఎన్ని పశువులు ఉన్నా, దావోస్ కు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసిన ఆయన చెప్పారంటే, నిజంగా వెలుగులోనికి వచ్చే అవకాశాలు ఉండి ఉంటాయన్నారు.

నోటీసులు ఇస్తే పేపర్ ద్వారానే సమాధానం చెప్పమనండి!
పార్టీలో నుంచి సస్పెండ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుందని, ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటారన్న రఘురామకృష్ణం రాజు, నోటీసులు ఇవ్వకుండా కూడా తమ పార్టీలో సస్పెండ్ చేస్తారని తెలిపారు. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న కొత్తపల్లి సుబ్బారాయుడిని అదే మాదిరిగా సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఇక తనకు గతంలో నోటీసు ఇచ్చారని, తన సమాధానం తో పని లేకుండానే వారి ఇష్టారీతికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయితే గోరంట్ల మాధవ్ కు నోటీస్ ఇస్తే, పేపర్ ద్వారానే సమాధానం చెప్పామని కోరాలన్నారు.

లేఖ రాయడం ఎందుకు శ్రమ అని, ఆయన జిమ్ నుంచి వచ్చి వీడియో ద్వారా సమాధానం చెబుతారని అనుకోవడం లేదన్నారు. గోరంట్ల మాధవ్ అంటే తనకు ద్వేషం లేదని, కేవలం జాలి మాత్రమే ఉన్నదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తాను ద్వేషంతో మాట్లాడుతున్నానని కొందరు అనుకుని అవకాశం ఉన్నదని అందుకే ఈ వివరణ ఇస్తున్నానని తెలిపారు. పార్లమెంట్లో తనని గతంలో అసభ్య పదజాలంతో దూషించి, హత్య చేస్తానని మాధవ్ అన్నప్పటికీ, పలికింది మాధవే అయినా… పలికించినవారు వేరొకరన్న విషయం తన తెలుసునని చెప్పారు. తాను ప్రివిలేజ్ కమిటీకి ఒక మారు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ తరువాత తాను దూకుడుగా వ్యవహరిస్తే ముత్యాలముగ్గు చిత్రంలో ప్రతి నాయకుడు రావు గోపాల్ రావు చెప్పినట్లుగా ఖర్చు అయిపోతాడని ఉద్దేశంతో తాను వెనక్కి తగ్గానని వెల్లడించారు.

ఎంపీగా జాబితా నుంచి తన పేరు తొలగించడం పట్ల హర్షం
భగవంతుడు ఉన్నాడని, భగవంతుని తాను నమ్మినంతగా మరొకరు నమ్మరని తాను భావిస్తానని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పేర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని, అప్పుడు తన పేరును తొలగించడం పట్ల బాధ కలిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ఇప్పుడు మాత్రం తనకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఒకవేళ తాను సంతోషంగా ఉన్నానని తమ పార్టీ వారికి తెలిస్తే మళ్లీ పేరును జాబితాలో చేర్చే అవకాశం ఉన్నదని అపహాస్యం చేశారు.

గత రెండు రోజులుగా తమ పార్టీ సహచర ఎంపీ వీడియో, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నదని, గూగుల్, ట్విట్టర్లలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నదని తెలిపారు. ఇక ఈ వీడియో వెలుగులోకి రావడంతో తెలుగు వాళ్లంతా నిర్గాంత పోవడమే కాకుండా, సిగ్గుపడ్డారన్నారు. వీడియో వెలుగులోకి వచ్చిన నాటి నుంచి, గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని మహిళలు రోడేక్కి దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని తెలిపారు. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలకు వెనుకాడుతున్నారని చెప్పారు.

ఉపరాష్ట్రపతిగా ధన్ కర్ భారీ మెజార్టీ తో విజయం
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని రఘురామకృష్ణం రాజు ఆకాంక్షించారు. మనము ఓటు వేసిన వారు ఎవరైనా విజయం సాధించాలని కోరుకోవడం సహాజమని పేర్కొన్నారు. అలాగే, తాను కూడా ధన్ కర్ విజయాన్ని కాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతిగా ధన్ కర్ కు మొదట ఓటు వేయాలని ఉద్దేశంతో, ప్రధానమంత్రి మోడీ, కేంద్రమంత్రి వైష్ణవ్ తో కలిసి ఓటు వేసిన వారిలో తొలి ఆరు మందిలో తాను ఉన్నానని చెప్పారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని వీలైతే కలిసి పరామర్శిస్తానని తెలిపారు. ఇటీవల తాను అభిమానించి , ఆరాధించే ఎన్టీ రామారావు గారి నాలుగో కుమార్తె మృతి చెందిన విషయం తెలిసిందేనని, ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ని కలిసి పరామర్శించడానికి ప్రయత్నిస్తానని వెల్లడించారు.

Leave a Reply