Suryaa.co.in

National

కుంభమేళాలో ప్రసాదం వడ్డించిన ఎంపీ సుధామూర్తి

ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో భక్తులకు ఎంపీ సుధామూర్తి మహాప్రసాదాన్ని వడ్డించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత స్థానిక ఇస్కాన్ క్యాంప్‌ను సందర్శించి భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారు. సుధామూర్తి తొలుత ఇస్కాన్ వంటశాలకు వెళ్లి అక్కడి వాలంటీర్లతో మాట్లాడారు. మెషీన్లతో భోజన తయారీని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కౌంటర్ వద్ద నిలబడి కుంభమేళాకు వచ్చిన భక్తులకు చపాతి, భోజనం వడ్డించారు.

LEAVE A RESPONSE