Suryaa.co.in

Andhra Pradesh

జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముకేశ్ కుమార్ మీనా

అమరావతి: రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్), జీఏడీ సేవలు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈమేరకు బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు జీఏడీ అధికారులు, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు ముకేశ్ కుమార్ మీనాను కలిసి శుభా కాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE