నాణ్యతా ప్రమాణాలతో పనిచేసే హెల్త్ కేర్ యూనిట్లు పరిగణలోకి తీసుకున్న కేంద్రం
సీఎం జగన్ వైద్య విభాగంలో తీసుకొచ్చిన సంస్కరణలతోనే లభించిన గుర్తింపు
రాష్ట్రంలోనే మొట్టమొటదిసారిగా విశాఖలోని రెండు ఆసుపత్రులకు NABH అక్రిడియేషన్ లభించింది. GMCH (గవర్నమెంట్ మెంటల్ కేర్ హాస్పిటల్) మరియు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ ఛెస్ట్ డిసీజెస్ ఆసుపత్రులకు నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (NABH) అక్రిడేషన్ మంజూరు చేసింది.
క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) లోని ఒక విభాగమే NABH. ఇది దేశంలోని ఆసుపత్రులు, హెల్త్ కేర్ సెంటర్స్, రక్తదాన కేంద్రాలు, ఆయుష్ ఆసుపత్రులు, వివిధ స్థాయిల్లో పనిచేసే హెల్త్ కేర్ యూనిట్లకు నాణ్యతా ప్రమాణాలను బట్టి గుర్తింపు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది. సుమారు 10 చాప్టర్లు, 100 ప్రమాణాలు కలిగిన ఈ విభాగం 503 లక్ష్యాలతో పనిచేస్తుంది.
ఆసుపత్రులు ఈ అక్రిడేషన్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకుంటాయి. కేంద్రం ఇచ్చిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి, ఆసుపత్రులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(SOP)కి అనుగుణంగా ఉన్నట్టు నిర్ధారించిన తర్వాత, వాటికి అక్రిడియేషన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ అక్రిడియేషన్ కాలపరిమితి మూడేళ్లు ఉంటుంది.
NABH ఏమిటంటే…
NABH ధృవీకరణ పొందాలంటే ఆసుపత్రులు ముఖ్యంగా ఎనిమిది విభాగాల్లో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలి. ఈ ప్రమాణాలన్నింటినీకూడా విశాఖపట్నంలోని రెండు ఆస్పత్రులు అందుకున్నాయి. సర్వీస్ ప్రొవిజన్, రోగుల హక్కులు, ఇన్‌పుట్స్, సహాయక సేవలు, క్లినికల్ కేర్, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, నాణ్యమైన ఆరోగ్య సేవల నిర్వహణ మరియు రోగి భద్రత.
ఈ విభాగాల్లో సంపూర్ణమైన ప్రమాణాలు పాటిస్తున్నాయి. వీటినిపరిశీలించిన బోర్డు రెండు ఆస్పత్రులకు అక్రిడేషన్ మంజూరు చేసింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ స్థాయి ప్రమాణాలు రాష్ట్రంలోని అన్ని టీచింగ్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, PHC, UPHC, CHS, VHC లలో సైతం జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు (NQAS) ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో చేపట్టిన నేషనల్ హెల్త్ మిషన్..
సీఎం వైయస్.జగన్ ప్రజలకు ఆరోగ్య సేవలను అత్యుత్తమ ప్రమాణాలతో అందించాలని పలుమార్లు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఇందుకోసం నేషనల్ హెల్త్ మిషన్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హెల్త్ కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ప్రమాణాలు ఉండేలా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 537 ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రులు NQAS ప్రమాణాలను అందుకున్నాయి. 2023-24 సంవత్సరానికి 2,956 కేంద్రాలను ఈ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
ఇదే కార్యక్రమంలో భాగంగా మరికొన్ని లక్ష్యాలున్నాయి
ప్రసవ సమయంలో సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడం, ప్రసవానంతర సంరక్షణ, ప్రసవ సమయంలో సమస్యల తీవ్రతను తగ్గించడం, ప్రజారోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణీలందరికీ గౌరవ ప్రదమైన ప్రసూతి సంరక్షణ అందించడం ఇందులో మరొక ప్రధానమైన అంశం. ప్రసూతి మరణాల రేటును పూర్తిస్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా NQAS పనిచేస్తుంది.
2022-23 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ధృవీకరించబడిన జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు (NQAS)సాధించిన ఆరోగ్యం కేంద్రాలు 2041 అయితే, ఇందులో 452 ఆరోగ్యకేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా NQAS ప్రమాణాలు సాధించిన ఆరోగ్యకేంద్రాల్లో 18% ఏపీలోనే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడచిన మూడున్నర నెలల్లోనే 170 ఆరోగ్యంకేంద్రాలను NQAS ధృవీకరణకోసం పంపడం జరిగింది.