Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడుని కలిసిన నాగబాబు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె. నాగబాబు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం నాగబాబు , ఆయన సతీమణి పద్మజ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు నాయుడు ని కలిసి శాలువాతో సత్కరించిన అనంతరం బొకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగబాబు ని శాలువాతో సత్కరించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.

LEAVE A RESPONSE