
మలేసియా – భారత్ కి మధ్య 1000 సంవత్సరాల అనుబంధమని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు గుర్తు చేశారు. అప్పటి నుండే గుజరాత్ నుండి మలేసియా కేళున్తాన్ కి పట్టు , దిగుమతి జరిగేదని, చెట్లు నాటడానికి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రము నుండి బ్రిటిషు వారు భారతీయు కార్మికులను తీసుకోని వచ్చారని రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను రమేష్‌నాయుడు భారత హైకమిషనర్‌కి గుర్తు చేశారు.
వీరి దేశభక్తి అనన్యమైనదని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వలస కార్మికులను కలుపుకొని నేతాజీ స్వాతంత్ర పోరాటానికి ఆజాద్ హింద్ లో సైనికులుగా తయారు చేశారని చెప్పారు. నేడు జనాభా రీత్యా స్థానికుల తరువాత భారతీయులు మూడవ స్థానం లో ఉన్నారని, ప్రధానమంత్రి విదేశీ పాలసీ వల్ల ప్రపంచం లో గౌరవం , గుర్తింపు పెరిగిందన్నారు. నాగోతు రమేష్ నాయుడు తో పాటు శాస్త్రవేత్త శంకర్ మరియు ఆచార్య ఆరీఫుల్లా తదితరులు పాల్గొన్నారు.