అసెంబ్లీ జగన్ రెడ్డి జాగీరా?

– రోశయ్యకు సంతాపం తెలియజేయని సభ ఎందుకు?
– మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యపట్ల జగన్ రెడ్డి సర్కారు అనుసరించిన విధానం అత్యంత దుర్మార్గం. రాజకీయ కురువృద్ధుడిగా పేరొందిన వ్యక్తి మరణిస్తే.. ముఖ్యమంత్రిగా కనీసం సంతాపం తెలపకపోవడం జగన్ రెడ్డి కుసంస్కారానికి నిదర్శనం. తండ్రి శవం దొరక్క ముందే.. ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన కుతంత్రాలకు తలొగ్గలేదనే అక్కసుతోనే అవమానిస్తున్నాడు.

కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఒక జిల్లాకు కొణిజేటి రోశయ్య పేరు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా.. ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం మీ అహంకారానికి నిదర్శనం. ప్రతిపక్షాలపై బురద జల్లడానికి, వ్యక్తిగత హననానికి చట్ట సభల సమయాన్ని కేటాయిస్తున్న జగన్ రెడ్డి.. ప్రజానాయకుడి మృతికి సంతాపం తెలిపేందుకు సమయం లేకపోయిందా.? మీ యొక్క అహంకార పూరిత నిర్ణయాలే.. మిమ్మల్ని పాతాళానికి దిగజార్చుతాయని గుర్తుంచుకోవాలి. అసెంబ్లీలో గీతలు గీసి.. ఆ గీతలు దాటితే ప్రతిపక్షాలను సస్పెండ్ చేస్తామంటున్న వైసీపీ నేతల తల రాతలు మార్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

Leave a Reply