దళిత, బలహీన వర్గాల నాయకులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని వ్యక్తి ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని
– నందిగామ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ. మా నందిగామలో చంద్రబాబుపై రాళ్ళ దాడికి పాల్పడిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్లతో రాజీపడి పార్టీకి ద్రోహం చేసిన నమ్మక ద్రోహి కేశినేని నాని. తిరువూరు టీడీపీ ఇంచార్జ్ శావలదత్తు గారిని బండ బూతులు తిడుతూ, ఆయనపై దాడికి యత్నించినమాట వాస్తవం కాదా? కొండలు గుట్టలు దోచేసే నేతలను నిజాయితీపరులంటూ కితాబు ఇచ్చిన నాడే నాని నిజాయతి ఏంటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసుకోలేకపోయారు.
మాట్లాడితే టాటా ట్రస్ట్ తెచ్చాను అంటూ నాని మాట్లాడటం, గ్రామాలూ అభివృద్ధి చేశాను అంటున్నారు అవి ఏమి మీ సొంత నిధులు మీ డబ్బులు కావుగా నాని. ఎంపీ కేశినేని నానీది ఫ్యూడల్ మనస్తత్వం. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిపై యువనేత నారా లోకేష్ గారి పై ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని చేసిన వ్యాఖలను తీవ్రంగా ఖండిస్తున్నాము..