అన్న‌లా అండ‌.. ఆత్మీయ ప‌రామ‌ర్శ‌

– మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న
ఆప‌ద‌లో వున్న‌వారికి అన్న‌లా అండ‌గా నిలిచారు. కుటుంబ‌స‌భ్యుల్ని కోల్పోయిన వారిని ఆత్మీయంగా ప‌రామ‌ర్శించి నేనున్నాన‌నే భ‌రోసానిచ్చారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టౌన్‌లో 30, 31 వార్డుల్లోనూ, దుగ్గిరాల‌, కుంచ‌న‌ప‌ల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ రెండురోజుల ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది.
స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వం
త‌న మ‌తం స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వ‌మ‌ని త‌న ప‌ర్య‌ట‌న ద్వారా నారా లోకేష్ చాటిచెప్పారు. దుగ్గిరాల బిలాల్
lk3మస్జీద్ లో ప్రత్యేక దువాలో నారా లోకేష్ ప్రార్థ‌న‌లు చేశారు. లూధరన్ చర్చి లో జ‌రిగిన‌ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. దుగ్గిరాలలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయాన్ని పరిశీలించారు.
ఆత్మ‌బంధువులా…
ఇటీవలకాలంలో మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో
lk-disబాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించారు. బుధ‌వారం 30 మంది, గురువారం 30 మంది ఇళ్ల‌ని సంద‌ర్శించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
స‌మ‌స్య‌లు ఏక‌రువుపెట్టిన ప్ర‌జ‌లు
ప‌ర్య‌ట‌న‌లో ఏ వీధికెళ్లినా, ఏ ఊరు చేరినా ప్ర‌జ‌లు లోకేష్ ఎదుట త‌మ స‌మ‌స్య‌లు ఏక‌రువు పెడుతూనే వున్నారు.దుగ్గిరాల గ్రామంలో పారిశుద్ధ్యం, రోడ్లు అధ్వానంగా వున్నాయ‌ని స్థానికులు వివ‌రించారు.
నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, చెత్త ప‌న్నులు భారంగా మారాయ‌న్నారు.
lk4దుగ్గిరాల‌ ఎస్సి కమ్యూనిటీ హాల్ ని అముల్ పాల సేకరణ కేంద్రానికి ఇవ్వాల‌ని చూస్తున్నార‌ని ద‌ళితులు ఆవేద‌న వ్య‌క్తంచేశారు.పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయ‌ని, ప్ర‌భుత్వం ఇచ్చే 10వేలు ఓన‌ర్ల‌కి చేరి త‌మ బ‌తుకు దుర్భ‌రంగా మారింద‌ని ఆటోడ్రైవ‌ర్లు వాపోయారు.
మ‌రో రెండున్న‌రేళ్లు జ‌గ‌రోనాతో పోరాటం
క‌రోనా కంటే భ‌యంక‌ర‌మైన వైర‌స్‌లా మారి రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల్ని పీల్చి పిప్పి చేస్తోన్న జ‌గ‌రోనా వైర‌స్‌తో మరో రెండున్నరేళ్ల పాటు అంతా క‌లిసి పోరాడ‌క త‌ప్ప‌ద‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

పిలుపునిచ్చారు. జ‌గ‌న్ అధికారంలోకొచ్చాక ధ‌ర‌లు, ప‌న్నులు పెంచుకుంటూ పోతున్నార‌ని ఆరోపించారు. విద్యార్థి, ఉద్యోగ‌, రైతు, కూలీ వ్య‌తిరేక ప్ర‌భుత్వమ‌ని విమ‌ర్శించారు. మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌లు రెండుసార్లు గెలిపించిన ఎమ్మెల్యే ఎప్పుడైనా మీ గ్రామానికి , మీ వీధికి వచ్చారా? మీ సమస్యలు తెలుసుకున్నారా? అని ప్ర‌జ‌ల్ని ప్ర‌శ్నించారు.
స్పందించే గుణం…అందించే సాయం
లోకేష్ స్పందించే గుణం మ‌రోసారి ఈ ప‌ర్య‌ట‌న‌లో వెల్ల‌డైంది. క‌ష్టం అని తెలిసినా, సాయం కోసం ఎవ‌రైనా అడిగినా స్పాట్‌లోనే అందించి శెహ‌భాష్ అనిపించుకున్నారు. దుగ్గిరాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడు ఉన్నం ప్రవంత్ కుటుంబానికి రెండు లక్షలు, ప్రమాదంలో గాయపడిన క్రాంతికి 50 వేల ఆర్థిక సాయం అందించిన నారా లోకేష్‌… కుటుంబ‌స‌భ్యులు అధైర్య‌ప‌డొద్ద‌ని, అండ‌గా వుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.
చిరు వ్యాపారం కోసం తోపుడు బండి మంజూరుచేయాల‌ని గౌసియా బేగం కోర‌గా అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.అధికారులు త‌మ ఇళ్లు కూల్చేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని మ‌హిళ‌లు లోకేష్‌కి విన్న‌వించుకోగా, అధికారుల దృష్టికి తీసుకెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌న్నారు.

Leave a Reply