మూడు ముక్కలాటకి హైకోర్టు తీర్పు చెంపపెట్టు

95

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

వైసీపీ సర్కారు విద్వేషపు ఆలోచనలతో తలపెట్టిన మూడు ముక్కలాటకి హైకోర్టు తీర్పు చెంపపెట్టు. ప్రజారాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన‌ రైతుల విజయం ఇది. అభివృద్ధి వికేంద్రీకరణ ముద్దు…రాజధాని వికేంద్రీకరణ వద్దు అనే నినాదంతో అమరావతి ప్రాంత సకల జనులూ సాగించిన నిస్వార్థ ఉద్యమ ఫలితం ఇది. సర్కారు అరెస్టులు, నిర్బంధాలు, దాడులు ఎదురొడ్డి శాంతియుత ఉద్యమంతో విజయం సాధించిన రైతులు, మహిళలు, విద్యార్థులు, రైతు కూలీలు, మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలకు ఉద్యమాభివందనాలు. అమరావతి అజరామరం. కూల్చాలని, తరలించాలని దురాలోచనలు మానేసి న్యాయస్థానం ఆదేశాలతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తే చరిత్రలో మీకో పేజీ వుంటుంది.