– నా భార్యను ఏదో అన్నారని చంద్రబాబు ఏడుపేంటి..?
– టీడీపీ తెలుగు మహిళ అనితకు నచ్చిన మద్యం బ్రాండ్లు చౌకగా దొరకడం లేదనేనా ఆమె బాధ..?
– మహిళలు మాట్లాడకూడని మాటల్ని తెలుగు మహిళలతో మాట్లాడించడమేనా బాబు సంస్కృతి?
– బాబే మద్యం, గంజాయి సరఫరా చేసి టీడీపీ తాగుబోతు నేతలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు
– జగన్ గారి పరిపాలనపై చర్చించే దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చించండి
– వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ నారమల్లి పద్మజ
నారమల్లి పద్మజ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
సహజంగా ఏ పార్టీ అయినా, ఏదైనా అంశంపై ప్రెస్‌మీట్‌లు పెట్టాలంటే మాట్లాడాల్సిన అంశాల గురించి భావాలు, భాషపై ఒక పద్దతి ఉంటుంది. కానీ రాష్ట్రానికి శనిలా దాపురించిన ప్రతిపక్ష నాయకుడు, రాజకీయంగా 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ కేవలం తిట్టించడానికి మాత్రమే ప్రెస్‌మీట్‌లు పెట్టించే దౌర్భాగ్యపు స్థితికి చేరుకున్నాడు.ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేకే టీడీపీ బూతుల పంచాంగం
– యువ నాయకుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల అభిమానం చూరగొన్న సీఎంను, ఆయన పరిపాలనను చూసిన తర్వాత అభివృద్ధిపైనగానీ, సంక్షేమంపైన గానీ మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన పార్టీలోని కొంత మంది తాగుబోతు నాయకుల చేత బూతులు తిట్టించడమే పనిగా పెట్టుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు?అంటే చెప్పుకోవటానికి ఒక్క మేలు అయినా లేదు. ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడ్డావని ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి చంద్రాబబుది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి అవసరమే లేని రీతిలో ఈరోజు ముఖ్యమంత్రిగారు జగన్ పరిపాలన చేస్తున్నారు.
జగన్ పరిపాలనపై విమర్శలు చేయడానికి ఏ అంశాలు లేక, ముఖ్యమంత్రిని తిట్టడానికి, బూతులు మాట్లాడటానికి, తమ పార్టీ నాయకులతో కారుకూతలు కూయించడానికే చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. బాబు ఏం చెబితే… ఆ కారుకూతలు కూయడానికి పట్టాభి లాంటి వెధవలు మీడియా ముందుకు వస్తారు. చంద్రబాబే దగ్గరుండి, టీడీపీ ఆఫీస్‌లో రెండు పెగ్గులు పోసి పంపిస్తే పట్టాభి మీడియా ముందుకు వచ్చి… ముఖ్యమంత్రి గారిని పట్టుకుని బోషడీకే అని తిడతాడు.
ఇక విశాఖలో ఒక ముసలి నక్క, గంజాయి డాన్ అయ్యన్నపాత్రుడు అదేపనిగా గంజాయి పట్టించి, ముఖ్యమంత్రిగారిని చెత్త నా… అంటూ అని తిడతాడు. ఇక పార్టీ లేదు బొక్కా లేదన్న అచ్చోసిన ఆంబోతు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి ని దొంగ సీఎం అని తిడతాడు… బూతులు తిట్టించడానికేనా చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం పనికొస్తుంది.. అని ప్రశ్నిస్తున్నాం.
మద్యం, గంజాయి తాపించి బాబు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు..
అలాగే టీడీపీలో మహిళా నాయకురాలు గంజాయి, మద్యం తాగినా సరిపోక, మరింత కిక్ రావాలంటే డ్రగ్స్ వాడించి, వాడు, వీడు, అరేయ్, ఒరేయ్, తురేయ్ అని మాట్లాడమని చంద్రబాబే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాడు. మా పార్టీ ఆఫీసుల్లో ఎప్పుడూ సంస్కారంగా మాట్లాడే విధానంతోనే ప్రెస్‌మీట్‌లు పెట్టాం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి అధికార ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళం ఉన్నాం, ఎప్పుడూ చంద్రబాబు నాయుడు పెట్టిస్తున్నట్లుగా బూతుల ప్రెస్ మీట్లు పెట్టించలేదు. టీవీ డిబేట్స్‌లో కూడా చాలా పద్థతిగా, చక్కటి భాషతో కేవలం సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తులం మేము. దిగజారుడు మాటలు, బూతులు విధానం మా వైయస్సార్ సీపీలో ఉండదు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అంతే కాకుండా అగ్రవర్ణ పేదలు, మహిళలకు కూడా మేలు కలిగేలా పథకాలు తీసుకువచ్చారు. నవరత్నాలతో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
దమ్ముంటే.. జగన్ పరిపాలనపై అసెంబ్లీలో చర్చించండి
చంద్రబాబు నాయుడు తాపిస్తే తాగి ప్రెస్‌మీట్‌లకు వచ్చే స్టాండెడ్ లేని దిగజారుడుతనానికి బెంచ్‌మార్క్‌గా టీడీపీ ప్రెస్ మీట్లు ఉన్నాయి. బాబు అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకుగానీ, బడుగు, బలహీన వర్గాలకుగానీ ఫలానా మేలు చేశానని చెప్పుకోవడానికి కూడా అర్హత లేని పరిస్థితి. మా ప్రభుత్వ విధానం మీద, జగన్ మోహన్ రెడ్డిగారి 32 నెలల పాలన గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రండి, చర్చిద్దాం.
టీడీపీలో చంద్రబాబుకు వేరే విధానం ఉంటుందా..
చంద్రబాబు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు మాత్రం రారట. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, భజన బృందం, వారి చెంచాలు మాత్రమే అసెంబ్లీకి వస్తారట. మీ పార్టీకంటూ ఒక విధానం ఉండదా? మీకో విధానం, మీ పార్టీ నాయకులకు మరో విధానమా? ఇదేనా తెలుగుదేశం పార్టీ నడుస్తున్న తీరు. దీన్నిబట్టే అర్థం అవుతుంది ఎంత బలహీనమైన నాయకత్వంలో మీరు పార్టీని నడిపిస్తున్నారనేది.
టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గురించి మాట్లాడితే… ఆమె ఏంటో, ఆమె స్థాయి ఏంటో, ఆమె బతుకేంటో తెలుసుకోకుండా… ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ముఖ్యమంత్రిని, రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు ఒక రక్షాబంధనాన్ని ఇస్తున్న జగనన్నను విమర్శించే అర్హత, స్థాయి నీకు ఉందా?
మహిళలు మాట్లాడలేని మాటలను తెలుగు మహిళలు పేరుతో మాట్లాడించడం ప్రజలంతా గమనించారు. అందుకే ఏ ఎన్నికల్లో అయినా సరే చంద్రబాబుకు బుద్ది వచ్చేలా తీర్పు ఇచ్చినా బాబు తీరు మారడం లేదు. ఇకనైనా చంద్రబాబు తన దిగజారుడు, నీచమైన రాజకీయాల కోసం బూతుల ప్రెస్‌మీట్లు పెట్టే కార్యక్రమాలు మానుకోకుంటే ప్రజలు క్షమించరు.
బెల్టు షాపులు రద్దయ్యాయన్నదే మీ బాధా..?
చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక, రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు అయిపోయాయన్నదే అనిత బాధా?. లేక నచ్చిన బ్రాండ్‌లు చౌకగా దొరకడం లేదన్న ఏడుపా? సాధారణంగా పిల్లలను గిల్లితేనో, కొడితేనో ఏడుస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడును గిల్లకుండానే ఏడుస్తాడు. నా భార్యను ఏదో అన్నారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తాడు. ఆయన భార్య గురించి మా పార్టీ నాయకులు ఎవరూ ఒక్క మాట అనలేదు. అలాంటిది చంద్రబాబు తన భార్యను కూడా పబ్లిక్‌లోకి, రాజకీయ వేదికల్లోకి తీసుకువచ్చాడు. తన రాజకీయ లబ్ధి కోసం ఎంతవరకైనా దిగజారే అంత నీచ ప్రవృత్తి ఉన్న వ్యక్తి చంద్రబాబు.
“నీచుడు, నికృష్ణుడు, వెన్నుపోటుదారుడు” అని స్వయానా పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు చంద్రబాబు గురించి మీడియా ముందు వాపోయారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ను అధికారం కోసం వాడుకుని వదిలేశాడు. అలాగే సొంత తమ్ముడ్ని పిచ్చివాడిని చేసి కాళ్లకు సంకెళ్లు వేసి బంధించి, ఆయన కుటుంబాన్నే నాశనం చేశాడని, జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు మీడియా ముందు చెప్పిన సంఘటనలను ప్రజలంతా చూశారు.
అలాగే నందమూరి హరికృష్ణ శవాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేశాడు కాబట్టే చంద్రబాబును బైబై బాబు.. అంటూ ప్రజలు తరిమి తరిమి కొట్టారు. అధికారాన్ని కోల్పోయి రాష్ట్ర ప్రజలకు మొహం చూపించుకోలేక హైదరాబాద్ పారిపోయి బంజారాహిల్స్‌లో నెత్తిన గుడ్డేసుకుని, మూలన కూర్చున్నాడు. అప్పుడప్పుడు కుయ్యో మొర్రో అంటూ లేచి జూమ్ మీటింగ్‌లు పెట్టి రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తిట్టించడం, సర్పంచ్‌లను అడ్డుపెట్టుకుని బూతులు మాట్లాడించడం, అమరావతిని అడ్డుపెట్టుకుని రైతుల్ని, రైతులని చెప్పుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అనుచిత వ్యాఖ్యలు చేయించడం బాబుకు నిత్యకృత్యంగా మారింది.
ఒక అమ్మ ఒడి, చేయూత, ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, రైతులకు ఇచ్చే పథకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు ఇచ్చే అనేక పథకాలు, అలానే మహిళలకు రాజకీయ ఉన్నతికి నామినేటెడ్ పోస్టులతో పాటు, కాంట్రాక్ట్ పనులలోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే.
మహిళా దినోత్సవం వేళ… రాష్ట్ర మహిళలంతా జగనన్నకు జేజేలు పలుకుతారనే ఈర్ష్య, అక్కసు, కడుపు మంటతో తాగుబోతు నాయకులతో చంద్రబాబు కారుకూతలు కూయిస్తున్నాడు. బాబు వైఖరి ఇలాగే ఉంటే రాష్ట్ర మహిళలు మిమ్మల్ని క్షమించరు. మళ్లీ మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నది గుర్తెరగాలి.