– ‘కుల’కాలం హాయిగా సాగనీ..
– ‘మున్సిపల్’లో ‘కాపు’ కాస్తున్న మంత్రి గారు
మొన్న ఎన్నికలు ఫలితాలు రాకముందే జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు హడావుడి చేసిన ఐఏఎస్ అధికారినే..
మళ్ళీ జగన్ రెడ్డి సీఎం అవ్వటం ఖాయం.. మంచి ముహూర్తం పెట్టించాలి..
ప్రమాణ స్వీకారానికి, స్థలం ఎక్కడ ఏర్పాట్లు చెయ్యాలి..
ఎన్నికల ఫలితాలకు ముందు, ఆ ఐఏఎస్ చేసిన హడావుడి కి అనేకమంది ఐఏఎస్ అధికారులు స్టన్ అయ్యారట..
ఆశ్చర్య పోయారట..
అప్పటికే జగన్ రెడ్డి కి, దగ్గరుండి నివాసం కూడా దగ్గర ఉండి కట్టించారట. ఎక్కడంటే.. అదేనండి, విశాఖపట్నం లో ఋషికొండ పై, అదికూడా వందల కోట్ల ఖర్చుతో..
ఆ ఐఏఎస్ అధికారి ఆశించింది, తారుమారైంది.
వైసీపీ ఘోరం గా ఓడిపోయింది.
కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది.. ఆ ఐఏఎస్ అధికారికి, గతంలో సాన్నిహిత్యం వున్న, నారాయణ మున్సిపల్ శాఖకు మంత్రి అయ్యారు..
ఇంకేముంది నారాయణ.. నారాయణ అని, ఆయన పక్కన చేరారు ఆ ఐఏఎస్ అధికారి. మళ్ళీ పాత వైభోగం రాబోతుందని సంబర పడ్డారు.. కాలం కలిసొచ్చింది, కులం తోడు వచ్చింది. ముందుగా మున్సిపల్ శాఖను దక్కించుకున్నారు.
ఆ తర్వాత సీఆర్డీఏ కమిషనర్ పోస్టును కూడా, మంత్రి నారాయణ ద్వారా దక్కించుకున్నారు.
ఆ ఐఏఎస్ అధికారి ఎవరనుకున్నారు?. ఆయన పేరు కన్నబాబు! గతంలో మున్సిపల్ శాఖ లో పనిచేసి, అప్పటి మంత్రి నారాయణ కి సన్నిహితుడయ్యారు. ఆయన ఆడిందే ఆట. పాడిందే పాట గా అధికారం చెలాయించారు.. అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.. రుషి కొండపై, జగన్ రెడ్డి సూచనలకు అనుగుణంగా, వందల కోట్ల ఖర్చుతో భవన నిర్మాణం జరిగింది. మొత్తం పర్యవేక్షణ దగ్గరుండి చేసింది ఐఏఎస్ అధికారి కన్నబాబేనని సీఎం చంద్రబాబు, డీసీఎం కళ్యాణ్ , మంత్రి లోకేష్ కి తెలుసు. అయినా వారందరికీ కూడా ఇస్టుడే .
వీరందరూ నిజాయతీ కన్నా, అవినీతి మిన్నగా భావించారేమో? నారాయణ అలుగుతారని ఊరుకున్నారేమో. అలాంటి ఐఏఎస్ అధికారులు అంటే మంత్రి నారాయణ కి ఇష్టమేమో?!
సీఎం చంద్రబాబు, డీసీఎం కళ్యాణ్ , మంత్రి లోకేష్ లను, ఏ మాయచేసారో!?
మొత్తానికి సీఆర్డీఏ కమీషనర్ గా కన్నబాబును నియమించేటట్లు చేశారు. అదికూడా నిజాయతీ ఐఏఎస్ అధికారి ని తప్పించి.. అదండీ అసలు నిజం!
నిజాయతీపరుడిగా పేరున్న కాటమనేని భాస్కర్‌ను తప్పించి, ఏరికోరి తనకు ‘కాపు’కాసే అధికారిని తెచ్చుకోవడంతో.. ముక్కుసూటి అధికారులు, నిజాయితీపరులు ఎప్పటికయినా బదిలీకి సిద్ధంగా ఉండాల్సిందేన న్న సంకేతం వెళుతోందన్న చర్చకు తెరలేచింది. ఇది ‘మంచి ప్రభుత్వానికి’ మంచిదా? కాదా?..
– ప్రసాద్ పెండ్యాల