Suryaa.co.in

Andhra Pradesh

కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు

– ఓడిఓపి కింద జులై 14న అవార్డు ప్రదానం
– ఢిల్లీలో అవార్డు అందుకోనున్న బాపట్ల కలెక్టర్ జె.వెంకట మురళి
– చీరాల కుప్పడం చీరకు ప్రాచుర్యం

చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జులై నెల 14వ తేదీన న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగునుందని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. చీరాల కుప్పడం పట్టు చీరకు ప్రకటించిన జాతీయ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి న్యూ ఢిల్లీలో అందుకోనున్నారు.

సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్ లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందనుంది. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్ లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుంది

LEAVE A RESPONSE