నవరత్నాల పేరుతో నవరంధ్రాలు:టీడీపీ

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన, ప్రభుత్వ టెర్రరిజాన్ని నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన 36 గంటల దీక్షలో భాగంగా రెండో రోజు పలువురు నాయకులు ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మానవహక్కుల్ని హరిస్తున్నారని, నవరత్నాల పేరుతో నవరంధ్రాలు చేస్తున్నారని మండిపడ్డారు.
దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి:
రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోంది. జగన్ రెడ్డి పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. పట్టాభి ఇంటిపై దాడి చేశారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై గంజాయి బ్యాచ్ తో దాడి చేశారు. దాడులు చేస్తే భయపడం. జగన్ రెడ్డి గుర్తుంచుకో..టీడీపీ అదికారంలోకి వస్తుంది. మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారు. అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలో తరిమి కొడతాం. 11 సీబీఐ, 6 ఈడీ, 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్నది జగన్ రెడ్డి కాదా.? జగన్ పరిపాలనలో ఇంతకన్నా ఏం ఆశించలేం. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి మాట్లాడితే వాటిని పక్కదారి పట్టించడానికి దాడులు కార్యక్రమం చేశారు. ప్రజలు విద్యుత్ బాదుడుపై కోపంగా ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నుండి పార్టీలోకి చేరికలు వస్తున్నాయి. మన కులం ఒకటే అంటూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఓట్లు వేయించుకుని ప్రజల్ని జగన్ ఎలా మోసం చేశారో కడపలో ఓ మాజీ మంత్రి చెప్పారు. తప్పు చేసిన అధికారుల లిస్టంతా రాయబడ్డాయి. డీజీపీ జగన్ రెడ్డికి సాగిల పడ్డారు. 5 సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. ప్రజాస్వామ్యానికి దెబ్బతగిలింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలి.
పరిటాల సునీత, మాజీ మంత్రి:
జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మనం అందరం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. చంద్రబాబు వల్ల ఇప్పటివరకు ఓపికగా ఉన్నాం. ఇకపై మాకు ఓపిక లేదు. గ్రామాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే దాడికి తెగబడ్డారు. అంత ధైర్యం ఎలా వచ్చింది? చంద్రబాబు గారు పోలీస్ వ్యవస్థను వినియోగించుకుని ఉంటే వైసీపీ గూండాలు ఒక్కరైనా మిగిలేవారు కాదు. టీడీపీ కార్యకర్తలను కొడుతున్నారు. ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. పరిటాల రవిగారిని పట్టపగలు పొట్టనపెట్టుకున్నారు. మరో 45 మందిని చంపారు. టీడీపీ వచ్చిన తర్వాత శాంతిగా ఉండాలని చంద్రబాబు గారు చెప్పారు. పరిటాల రవిని చంపినోళ్లు రోడ్డుపై తిరుగుతుంటే మేం ఎవరినీ ఏమీ అనలేదు. చంద్రబాబు గారు ఇక మారాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఒక్క గంట కళ్లు మూసుకోండి. మా అందరి రక్తం ఉడుకుతోంది. మీరు ఆదేశిస్తే ఏంటో చూపిస్తాం ఇప్పుడైనా. చంద్రబాబును నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మాకు కూడా తిట్లువస్తాయి. చంద్రబాబు గారి ఆదేశాలతో ఓపికగా ఉన్నాం. మాకు బీపీలు రావా, మాకు చీము, నెత్తురు లేవా? మాకు కూడా బీపీ వస్తుంది, మేం చేసే పనులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి . ప్రతి ఒక్కరి అకౌంట్ మేం రాసుకున్నాం
కిడారి శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి :
గిరిజన కుటుంబంలో ఉన్న మా నాన్న చనిపోతే నాకు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. వైసీపీ వచ్చాక మాత్రం దాడులు చేస్తున్నారు. దళిత చెల్లిని నడిరోడ్డు మీద చంపితే ఏం చేస్తున్నారు.? వైసీపీ రౌడీలను కాపాడటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మా నాయకుల్ని, కార్యకర్తల్ని కొట్టారు. చంద్రబాబు ఒక్క పిలుపుతో లక్షలాది మంది ఇక్కడికి వచ్చారు. చంద్రబాబు ఒక్క మాట చెప్తే మీరు పాదయాత్ర చేసేవాళ్లు. నాడు మేలు తలుచుకుంటే మీ కార్యాలయాలు నాడు వుండేవా.? రాజకీయం అంటే సామాజిక బాధ్యత అని చంద్రబాబు నేర్పించారు. రెట్టింపు వడ్డీతో మీకు చెల్లించే రోజు వస్తుంది. విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహిరించారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేసుకునే వరకు పోరాడతాం.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సీనియర్ నేత :
దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మానవ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటాయి. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి కార్యకర్తలు, సిబ్బంది తలలు పగులగొట్టారు. ఆటవిక పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇది ప్రభుత్వ ఉగ్రవాదం. చంద్రబాబు గారి ఇంటిపై జోగి రమేష్ దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? అసెంబ్లీలో, బయట వైసీపీ నేతలు చంద్రబాబు గారిని తిట్టిన తిట్లేంటి? ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును తుపాకీతో కాల్చాలని, ఉరితీయాలని, ముఖ్యకంత్రీ అని జగన్ రెడ్డి అనలేదా? ఆనాడు చంద్రబాబు చర్యలు తీసుకుని ఉంటే జగన్ రెడ్డి జైల్లో చిప్పకూడు తినేవారు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను రూపుమాపి చంద్రబాబు అభివృద్ధి చేశారు. పరిటాల రవిని పట్టపగలు చంపారు. ఎవరు కారణం? ముఖ్యమంత్రి ఇంట్లో దాక్కున్న యువనాయకుడు కాదా? తండ్రిని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నావు కానీ.. హత్యా రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు నీకు వెన్నతో పెట్టిన విద్య. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో ఏం సాధించావు? టీడీపీ నేతలపై అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు.
టీడీపీ ప్రధాన కార్యాలయంలో డీజీపీ పీఆర్వోను రక్షించిన లోకేష్ పై తప్పుడు కేసులు హత్యాయత్నం కేసు పెట్టారు. చంద్రబాబు వారసుడిగా వచ్చే లోకేష్ ను ఇప్పటి నుంచే బద్నామ్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఉగ్రవాదం కాక మరేమిటి? దాడి జరిగి 72 గంటలు గడిచాయి. ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా? చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తే చర్యలు లేవు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును బొక్కలో తోసి కాళ్లు విరగ్గొట్టారు. ఇది ఆటవిక పాలన కాదా? నవరత్నాల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా అవినీతి. మైనింగ్, లిక్కర్, శాండ్ మాఫియా రెచ్చిపోతోంది. రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రజల్లో తిరగలేని పరిస్థితి వచ్చింది. దీనిని అణచివేసేందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు. ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. 16 నెలలు చిప్పకూడు తిన్న పెద్దమనిషికి మళ్లీ జైలు తప్పదు. నీ కంటే ఎవరు తిట్టారు? మీ ఎమ్మెల్యేలు, మంత్రులు పచ్చి బూతులు తిడితే అప్పుడు గుర్తులేదా నీ తల్లి, నీ చెల్లి. మా కుటుంబసభ్యులను తిడితే, అసెంబ్లీలో చంద్రబాబు మైక్ కట్ చేస్తే అప్పుడు సిగ్గులేదా? అసెంబ్లీని ఎదుర్కోలేని దౌర్భాగ్యుడు పరిపాలన ఏం చేస్తారు? ప్రశాంత్ కిషోర్ ను పెట్టి తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను తప్పుదారి పట్టించి అధికారంలోకి వచ్చారు.
లక్ష హామీలు ఇచ్చి దానిని నవరత్నాలు అన్నారు. ఇవి నవరంధ్రాలుగా మారాయి. ఫ్యాక్షన్ నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా? రాష్ట్రపతి పాలన 356 ఆర్టికల్ ను రాష్ట్రంలో విధించాలి. అభివృద్ధి లేదు, పెట్టుబడులు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిధులను దారిమళ్లిస్తున్నారు. ఇక్కడ గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతోంది. తెలంగాణ పోలీసులే చెప్పారు. తెలంగాణ పోలీసులపై కేసులు పెట్టగలరా? ఆ దమ్ము ఉందా? గంజాయి, హెరాయిన్ అక్రమ రవాణాతో డబ్బులు పంచుకుంటున్నారు. తిరిగి తెలుగుదేశం రావాలి, మన జీవితాలు బాగుపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీ పతనం తథ్యం. అన్ని సామాజిక వర్గాలు ఒక్క తాటిపై వచ్చి మిమ్ముల్ని కూకటి వేళ్లతో పెకలిస్తారు. టీడీపీ కార్యకర్తపై చేయివేస్తే తిరుగుబాటు వస్తుంది. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. డీజీపీ తన కేసును మాఫీ చేయించుకునేందుకు చంద్రబాబు కాళ్ల దగ్గరకు వచ్చారు. తెల్గీ కుంభకోణంలో ఎలా బయటపడ్డారో ప్రజలకు చెప్పే రోజు వస్తుంది. మేం పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఫ్యాక్షన్ రాజకీయ నేత ఉచ్చులో చిక్కుకున్నారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రజా ఉద్యమం, అందరినీ కలుపుకుందాం. అహంకారం, ఈగో వద్దు. తెలుగుదేశం అందరిదీ. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇది. సంక్షేమమే ప్రధాన అజెండా. చంద్రబాబు ఐదేళ్లు అభివృద్ధి, అభివృద్ధి అన్నారు.. అధికారం పోయిందని నేను దెబ్బలాడాను. దేశంలో ఇన్ని గంటలు కష్టపడే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఇవాళ ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రాన్ని నాశనం చేశారు. సాగునీటి విషయంలో రాయలసీమకు నష్టం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు ముందుకు నడవడం లేదు. బిల్లులు చెల్లించడం లేదు. పట్టాభి ఇంటిపై దాడి, చేస్తే భార్య, చిన్న పిల్ల ఉంటే ఏమైంది దిశా చట్టం మూర్ఖుడా? అమ్మ అందరికీ ఉంది. అప్పుడు గుర్తులేదా?
కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ:
ఈ అరుపులు సరిపోవు. వైసీపీ వాళ్లు ఏ విధంగా దాడి చేశారో అందరం చూశాం. తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వణకాలంటే మన గొంతు చాలు. మనం ఒక్కసారి అరిస్తే జగన్ రెడ్డి వణికిపోవాలి. దేశ చరిత్రలో ఎప్పుడూ రాజకీయ పార్టీ మీద దాడి జరగలేదు. అన్న ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య. పోలీసులను అడ్డుపెట్టుకుని దాడిచేశారు. ఇప్పుడు రండి ఎంతమంది వస్తారో రండి. మీ భరతం పడతాం. సంస్కారవంతంగా ముందుకువెళ్లాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మా నాయకుడు మాకు నేర్పాడు. మా దగ్గర డాక్టర్ నారా లోకేష్ ఉన్నారు. మేం అధికారంలోకి వచ్చాక మీకు హార్ట్ అటాక్ గ్యారంటీ. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దాడిని ఎలా సమర్ధించుకుంటాడు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే బాబు గారిని ఫోన్ చేసి క్షమాపణ చెప్పేవాడివి. రాష్ట్రం కోసం కష్టపడిన వ్యక్తిని మీ మంత్రులు ఏమన్నారు? మీరు మాట్లాడిందా వేదాలా? మంత్రాలా?
ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఏపీని డ్రగ్స్ కు కేరాఫ్ చేస్తుంటే ఈ డీజీపీ ఏం చేస్తున్నాడు. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే డీజీపీ స్పందించడంలేదు. అవినీతి సమాధానం లేదు. పసుపుచొక్కా వేసుకుని రోడ్డు మీదకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీకు కోపమొచ్చిందా? డీజీపీ మీరు ఐపీఎస్ అని గుర్తుందా? మనస్పాక్షితో ఆలోచన చేయండి. డీజీపీ, ముఖ్యమంత్రిలో మార్పు వస్తుందని మేము దీక్ష చేయడంలేదు. ప్రజల్లో మార్పు రావాలి. మనలో కసి పెరగాలి. మనం అనుకుంటే సాధించలేనిది లేదు. పెద్దాయన ఆశీస్సులతో మనం ముందుకుకదలాలి. ప్రధానిని సైతం ఎదురించాం. 151 సీట్లు వచ్చాయని సీఎం బిల్డప్ ఇస్తున్నాడు. పట్టాభి ప్రశ్నలకే భయపడ్డారా? మా ప్రశ్నలకు సమాధానంలేక ఉడికిపోతున్నారు. రగులుతున్నారు. కేసులు అయ్యిపోయావ్. ఇక రోడ్డుపైకి దిగాల్సిందే. మనల్ని బెదిరించి ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నారు. ఎవరూ తగొద్దు. ఎవరబ్బ సొత్తు అని రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా చేస్తున్నారు. తెలంగాణ , కేరళ పోలీసులు డ్రగ్స్ విషయంలో ఏపీ వైపు చూపిస్తుంటే ఏం చేస్తున్నారు?
డీజీపీ పబ్లిక్ సర్వెంటా లేక వైసీపీ సర్వెంటా చెప్పాలి. దొంగచాటుగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో పోలీసు డ్రస్ వేసుకుని జగన్ రెడ్డి వత్తాసు పలికితే చూస్తూ ఊరుకోం. కరెంటు కోతలు, పెన్షన్ కటింగ్, ఇళ్ల పట్టాల దోపిడీ, అప్పులపై చర్చ జరుగుతోంది రాష్ట్రమంతా. వాటిని సమాధానం లేక ఫ్యాక్షన్ రాజకీయం నడుపుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఎక్కడైనా తెలుగువారికి టీడీపీ అండగా ఉంటుంది. మీరెన్ని కుట్రలు చేసిన భయపడం. మా బలం పెంచుకుంటూ పోతాం. ఇలాంటి బిల్డింగ్ లు ఎన్నో కడుతాం. డబ్బులు కోసం లాలూచీ పడే వాళ్లు మాకు లేరు. పార్టీ కోసం ప్రాణమిచ్చే వాళ్లు టీడీపీ కార్యకర్తలు. తెలుగుదేశం జెండా నీడలో బతుకుతున్నాం. జగన్ కి బ్యాడ్ టైమ్ స్టార్ట్ య్యంది. జగన్ కు భయం మొదలైంది కాబట్టే ఆయన దాడికి పురిగొల్పాడు. 25 ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచుతానన్నాడు. ఎవరి మెడలు వంచాడు. ఢిల్లీ వెళ్లాక కనపడిన వాడికి కనపడని వారికి మెడలు వంచుతున్నాడు. రాష్ట్రం కోసం మేము ఎన్నో త్యాగాలు చేశాం. ప్రధానితో పోరాడాం. వైసీపీ ఎంపీలు మనకు అవసరమా? ప్రధానికి ఎదిరించే ధైర్యం వైసీపీకి లేదా? చంచల్ గూడ జైలుకెళ్లాలనే భయంతోనే జగన్ భయపడుతున్నారు. ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు.
చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని. తాడేపల్లి ప్యాలెస్ వణకాలి. గట్టిగా నినాదాలు చేయండి. ఒక్క చాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టుకుని మాయ జగన్ కు ఓటు వేసినందుకు నాశనం అయ్యామని ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడ చూసినా పసుపు రంగు కనిపించాలి. పసుపు ఎంత శుభమో అందరికీ తెలుసు. మన ఆడపడుచులు ఏం చేసినా పసుపుతోనే మొదలుపెడతాం. అందుకే ఆ మహానుభావుడు పసుపు రంగు మనకు అందించాలి. క్రిమినల్స్ నుంచి కాపాడాలంటే పసుపు రావాలి. మేము సైనికులం. లోకేష్ అన్నగారిని చూస్తుంటే మా యువకులకు ఉత్సాహం వస్తోంది. ప్రతి యువకుడు లోకేష్ అన్నగారిని బలపరచాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వంశం వీరిది. ఈ సమయంలో మా నాన్నగారిని తలుచుకోవాలనిపిస్తోంది. అక్రమార్కుల తాట తీసేందుకు బాబాయ్ అచెన్నాయుడు నిద్రోరు. పిరికివాడు జగన్మోహన్ రెడ్డి మనం కాదు. దాడులు పెరిగినా ధైర్యంగా స్వీకరించండి. మనం లక్షకోట్లు తినలేదు. ప్రజాస్వామ్యాన్ని మనం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాం.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు:
ఏపీలో దుర్మార్గుడి పాలన నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మార్చేశారు. యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోకి వచ్చి గంజాయిపై దాడి చేసే పరిస్థితి. డ్రగ్ మాఫియాపై ప్రజల దృష్టి మరల్చేందుకే పట్టాభి ఇల్లు, టీడీపీ కార్యాలయంపై దాడి. పోలీసుల సంస్కరణ సభలో సీఎం చెప్పినవి పచ్చి అబద్ధాలు . పాలన ఎలా చేయాలో చంద్రబాబును చూసి జగన్ నేర్చుకోవాలి.
కూన రవికుమార్, సీనియర్ నాయకులు:
జగన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా? కేంద్ర కార్యాలయం 70 మంది లక్షల మందికి దేవాలయం అద్దాలు పగలకొడితే రక్తం ఉప్పొంగింది. 36 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు నీకు పోలిక ఎక్కడిది. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడిన భాష ఏంటి అదేమైన భగవద్గీత లోని స్లోకాలా? బోషడీకే అనే పదం గూగుల్ లో వెతికితే సంస్కృతంలో అయితే ఎలాగ ఉన్నారని అర్ధం. కాని జగన్ రెడ్డి దుష్టశక్తి కాబట్టే చెడు పదాన్ని తీసుకున్నారు.
పీతల సుజాత మాజీ మంత్రి:
ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. జనమంతా సంతోషంగా వుండాలని చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. కేసులు నుండి తప్పించుకోవడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వైసీపీ వచ్చాక డ్రగ్స్, శాండ్, మైన్, లిక్కర్ మాఫియాగా రాష్ట్రం మారింది వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు అంటకాగుతున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసం పోరాడే వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయనందుకు ప్రజలు బాద పడుతున్నారు. ప్రభుత్వ తప్పులు చూపెడితే అక్రమ కేసులు పెడుతున్నారు. మీ నాయకులకు బీపీలు వస్తే కొడతారు..మా నాయకులు మాములుగా వస్తోనే పచ్చడి అయిపోతారు. దమ్ముంటే ఇప్పుడు రండి. వైసీపీ గూండాలను పరెగెత్తిచ్చి కొడతాం. కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం చంద్రబాబు పోరాడుతున్నారు. ప్రజలు మారుతున్నారు. పార్టీ మీద దాడి చేసిన వారిని తిరిగి కొట్టే అవకాశం చంద్రబాబు మాకు కల్పించాలి.
కాలవ శ్రీనివాసులు, టీడీపీ మాజీ మంత్రి:
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు 36 గంటల దీక్షకు మన నాయకుడు కూర్చున్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి అంటే సంక్షమ పథకాలు అమలు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇసుక, బుసక, చికెన్ , మటన్ అమ్ముతున్నాడు. తన పాలనను ప్రశ్నించే వారిపై దాడులు చేయడం ద్వారా అరాచక పాలన కొనసాగిస్తున్నాడు.రాష్ట్రంలో పతనమైనపోతున్న ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు అనడానికి టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడే నిదర్శనం. తన ఆఫీస్ కు దగ్గరలోనే వైసీపీ మూకలు దాడిచేసినా డీజీపీకి సిగ్గుగా అనిపించలేదా?ఎటువంటి త్యాగాలకైనా టీడీపీ కార్యకర్తలు సిద్ధం కావాలి.
ధూళిపాళ నరేంద్రకుమార్, మాజీ శాసనసభ్యులు:
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా…ఆలోచించండి… ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికార బలంతో అరాచకం సృష్టిస్తున్నారు, ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారు. మంగళగిరిలో ప్రజాస్వామ్య దేవాలయంపై దాడి చేశారు.అరాచకాన్ని ప్రశ్నించే గొంతులనొక్కేందుకే పార్టీ జాతీయ కార్యాలయంపై దాడిచేశారు. ముఖ్యమంత్రి పూటకో మాట, నిమిషానికో వేషం వేస్తున్నారు. ఆయన అభిమానులు రెచ్చిపోయాటరంటున్నారు. చంద్రబాబు అభిమానులు రెచ్చిపోతే మీ పరిస్థితి మరోలా ఉండేది. పోలీసు అమరవీరుల సంస్మరణ సభను జగన్ రాజకీయ వేదికగా మార్చారు. నేరస్తులు, నేరగాళ్లు కొత్తరూపం ఎత్తారని తమగురించి జగన్ బాగా చెప్పుకున్నారు. వైకాపా అరాచకానికి సజీవ సాక్షి టిడిపి కార్యాలయంపై దాడి. బిపి వచ్చి దాడి చేశారన్న ముఖ్యమంత్రి మాటలు రాజ్యాంగ ఉల్లంఘన కాదా? పోలీసులు ఉన్నది రాజ్యాంగాన్ని రక్షించడానికి కాదా? దీనికి డిజిపి ఏం సమాధానం చెబుతారు? గూండాలతో చేతులు కలిపి ప్రతిపక్షాల గొంతునొక్కుతారా? ఎన్టీఆర్ స్పూర్తి ప్రతి తెలుగుదేశం కార్యకర్తలో ఉంది. మీ బెదిరింపులకు టిడిపి సైనికులు భయపడబోరు, చంద్రబాబు నాయకత్వంలో అరాచకానికి వ్యతిరేకంగా పోరాడతాం, ప్రజలను చైతన్యవంతులై తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది.
వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే:
వైసీపీ గూండాలు మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. రాష్ట్రంలో రౌడీ పాలన జరగుతోంది. మాకు మంచి రోజులొస్తున్నాయి జగన్ రెడ్డి సంబరపడకు. రాష్ట్రంలో సంక్షేమం ఎక్కడుంది.? అభివృద్ధి ఎక్కడుంది.? మహిళల మీద హత్యలు, దాడులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల మీద కేసులు పెడుతున్నారు. మా నాయకులు, కార్యాకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యాకర్తలు తిరగబడితే తాడేపల్లి నుండి బయటకు రాలేవు. జగన్ రెడ్డి త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారు.
దువ్వారపు రామారావు, ఎమ్మెల్సీ:
రాష్ర్టంలో దాడులు, దౌర్జన్యాలు అనే విష సంసృతికి జగన్ బీజం వేశారు. అన్ని వ్యవస్ధలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రావ్వాలి, అందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలి.
గంజి చిరంజీవి, అధికార ప్రతినిధి:
రాష్ట్రంలో ఎస్సీ, బీసీలను, ఎస్టీలను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం పెట్టిన కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడులు చేశారు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును దుర్భాషలాడారు. బహిరంగంగా ఉరితీయండి, కాల్చి చంపండి అని మాట్లాడినప్పుడు బాధలేదా.? మీ అసభ్య పదజాలాన్ని ప్రజలంతా చూస్తున్నారు. యువత భవిష్యత్ నాశనమవుతుండటంతోనే పట్టాభి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ప్రజలందరికీ ప్రశ్నించే హక్కు వుంది. బీసీ యువకుడు తల పగలగొట్టారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. ప్రజల్లో కదలిక వచ్చింది. బీసీలకు కాసుల్లేని కార్పొరేషన్లు పెట్టారు. ఏ ఒక్క బీసీకైనా రుణాలు ఇచ్చారా.? మహిళలకు పదవులిచ్చామని అబద్ధాలు చెప్తున్నారు. బీసీల ఆగ్రహంతోనే జగన్ గద్దె దిగుతున్నారు.
బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ:
ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. ఏపీని చంద్రబాబు రామరాజ్యంగా మారిస్తే జగన్ రాక్షస రాజ్యంగా మార్చారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అదోగతిపాలైంది. తెలుగు తమ్ముళ్లకు బీపీ వస్తే జగన్ తాట తీస్తారు. వైసీపీ తాకాటు చప్పుళ్లకు భయపడం. 2024లో టీడీపీదే అధికారం.
గౌతు శిరీష, టీడీపీ ప్రధాన కార్యదర్శి:
పోలీసు సర్వీసు అంటే పబ్లిక్ సర్వీస్ కాకుండా పొలిటికల్ సర్వీస్ లా మారింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం అంటే ప్రజాస్వామ్యంపై దాడే. చంద్రబాబు పిలుపు ఇస్తే లక్షలాది మంది తరలివస్తారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందుకే సంయమనం పాటిస్తున్నాం. రెండున్నరేళ్ల తర్వాత చూడాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి
మహ్మద్ నసీర్ అహ్మద్, జాతీయ అధికార ప్రతినిధి:
క్రమశిక్షణకు, నిబద్దతకు తెలుగుదేశం పార్టీ నిలువుటద్దం. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి భావితరాల భవిష్యత్తుపై జరిగిన దాడి. జగన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పెడతాం. నాడు దేశం కోసం గాంధీజీ దీక్ష చేస్తే..నేడు రాష్ట్రం కోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారు.
గోనుగుంట్ల కోటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల కార్పోరేషన్ మాజీ ఛైర్మన్:
దుర్మార్గంగా మాపై దాడి చేసి, ప్రజలప దాడి చేసి ఎంతోకాలం బెదిరించలేరు. మీ తాట వలిచి మా దివ్యాంగులకు చెప్పులు కుట్టిస్తాం. పార్టీ కేంద్ర కార్యాలయం మాకు దేవాలయంతో సమానం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి, హెరాయిన్, మత్తు పదార్థాలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. పచ్చి మోసగాడు జగన్ రెడ్డి. సీఎం చేసే అరాచకాలను ఎవరూ భరించలేక పోతున్నారు.
చదలవాడ అరవిందబాబు, టీడీపీ నేత:
తెలుగుదేశం పార్టీపై వైసీపీ ముష్కరులు దాడి చేశారు. చంద్రబాబు నాయుడు సంస్కారం ఉన్న నాయకుడు. రాష్ట్రంలో కిరాయి గూండాలు రాజ్యం ఏలుతున్నారు. జగన్ రెడ్డి సంక్షేమం పేరుతో దోచుకుంటున్నాడు. ఆడపడుచులు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి.
రావుల వెంకయ్య – అఖిల భారత కిసాన్ మహాసభ అధ్యక్షులు:
చంద్రబాబు నాయుడి దీక్షకు మా ప్రగాఢ సంఘీభావం తెలియజేస్తున్నాం. రైతు సంఘాలు చంద్రబాబుకు బాసటగా నిలుస్తాయి. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఘటనలు అత్యంత హేయం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్లు ప్రతీకారం తీర్చుకుంటామని మాట్లాడటం సమంజసం కాదు. వైసీపీ నేతలు ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రం మొత్తం తీసుకురావాలని చూస్తున్నారు. నియంతలు కాలగర్బంలో కలిసినట్టు జగన్ కూడా కాలగర్బంలో కలిసిపోతాడు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వైసీపీ చర్యలను ఖండిస్తూ ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ లో రైతులపై దాడి చేసిన అజయ్ మిశ్రాలా జగన్ కూడా రైతులపై దాడులు చేయాలని చూస్తే కాలగర్బంలో కలిసిపోతావ్
దివ్యవాణి, అధికార ప్రతినిధి:
ఇసుక కొరతతో రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ ప్రక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. యువకులకు ఉద్యోగాలు లేవు. రోడ్లు సరిగా లేవు. ఒక్కసారి ఛాన్స్ తో వచ్చి ప్రజలను మోసం చేసినందుకు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అమరావతి రైతులను రోడ్లపై కూర్చోబెట్టినందుకు జగన్ క్షమాపణ చెప్పాలి. లోకేష్ గారి, చంద్రబాబు నాయుడి గారి ఆధార్ లు చించుతామన్న వైసీపీ వాళ్లు నాలుకలు అదుపులో పెట్టుకోవాలి. మిగిలిన రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తే జగన్ రెడ్డి నాయకుడని ఒప్పుకుంటాం.
ఆచంట సునీత, అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు:
అవినీతి, అరాచకపు వ్యక్తి ముఖ్యమంత్రయితే రాష్ట్రం ఎలా ఉంటుందో జగన్ పాలనే ఉదాహరణ. ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని ప్రశ్నించినవారిపై దాడులు, దౌర్జన్యాలు చేయటం సిగ్గుచేటు. మీ దాడులుకు భయపడే వారు ఎవరూ లేరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చితే జగన్ రెడ్డి, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు మేం మీలా వ్యవహరిస్తే జగన్ , షర్మిల పాదయాత్ర చేసేవారా? వైపీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం చేసే అరాచకం ప్రజలంతా గమనిస్తున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది, 151 మంది ఎమ్మెల్యేలు ఒక్కో రాజారెడ్డి లాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం, ఇసుక మాఫియా నడుస్తోంది. జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై కి వెళ్లటం కాదు, దమ్ముంటే ఇప్పుడు రా మా సత్తా ఏంటో చూపుతాం. రెండున్నరేళ్లలో జగన్ ఒక్క రోజైనా ప్రజల్లోకి వచ్చారా? 500 మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగితే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? హోంమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారారు. డ్వాక్రా చంద్రబాబు మానస పుత్రిక. జగన్ డ్వాక్రా మహిళలను మోసం చేశారు. రాష్ట్రంలో గంజాయి మాఫియా నడుస్తోందని పక్క రాష్ట్రాలు పోలీసులు కూడా చెబుతున్నారు వారిపై ఎందుకు దాడులు చేయలేదు? విద్వుత్ బిల్లులు, నిత్యవర ధరలు పెంచి ప్రజలపై మోపం మోపారు. కొడాలి నాని నారా లోకేశ్ కాలి గోటికి కూడా సరిపోరు. లోకేష్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మహిళలే చెప్పులతో కొడతారు.
కొలికపూడి శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ అధ్యక్షుడు:
అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. అదే రాబోయే రోజుల్లో పునరావృతం కాబోతోంది. ఈరోజునుంచి సిఎం జగన్ కి గంజాయి ముఖ్యమంత్రిగా నామకరణం. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధిచేస్తారు. తాడేపల్లి నుంచి జగన్ ను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. సమస్యలనుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి.
భూమా విశ్వవిఖ్యాత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత:
పోలీస్ డిపార్ట్ మెంట్ కు సిగ్గుచేటు టిడిపి కార్యాలయంపై దాడి, పార్టీ కార్యకర్తలను కేసులు, దాడిలతో ఇబ్బంది పెడుతున్నారు, తెలుగుదేశం వారంటూ సంక్షేమ పథకాలు, పెన్షన్లు కట్ చేస్తున్నారు, ఇదేం సంస్కృతి? చంద్రబాబు పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శం.తెలుగుదేశం పార్టీ విజయానికి నాంది ఈ దీక్ష. పట్టాభిపై దాడిచేసిన వారిని శిక్షించకపోతే భవిష్యత్ లో పోలీసులకు ఇబ్బందులు తప్పవు.
నన్నూరి నర్సిరెడ్డి, తెలంగాణా తెలుగుదేశం నేత:
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఇంధనం. పగిలిన అద్దాల సాక్షిగా ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయి. ఆంధ్రప్రదేశ్ లో వేలకోట్ల మాదక ద్రవ్యాల మాఫియా నడుపుతున్నారు. వైసిపి మంత్రులు చంద్రబాబుపై వాడిన భాష శాస్త్రీయ సంగీతమా? రాజ్యాంగబద్ద పరిపాలన కొనసాగించడానికే చంద్రబాబు దీక్ష, రాష్ట్ర భవిష్యత్ అంధకారం కావద్దనే దీక్ష చేపట్టారు. వైసిపి ప్రతినిధులు సిగ్గూ,ఎగ్గూ వదిలేసి గంట, అరగంట కావాలంటున్నారు. ఎపి ప్రజలు ఏరికోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తంతున్నాడు. ఆర్థిక ఉగ్రవాదులతో ఆంధ్రప్రదేశ్ లో పాలన సాగుతోంది. కరోనా వచ్చినా బతకొచ్చు గానీ…మళ్లీ జగనొస్తే బతకలేమని ఎపి ప్రజలు అంటున్నారు. తెలుగుదేశం హయాంలో సైలైన్స్…వైసిపి పాలనలో వయొలెన్స్. ఆంధ్రప్రజలు అధికారంలోకి దొంగను తెచ్చుకున్నారు. తెలుగుదేశం జాతీయ కార్యాలయంపై దాడి సమయంలో తొడగొట్టిన నిలచిన కార్యకర్తలారా…వందనం. ఓడిపోతే పారిపోయే రకం తెలుగుదేశం కార్యకర్తలు కాదు. వైసిపి అప్రజాస్వామిక పాలనపై గళమెత్తుతాం. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
పొగాకు జయరాం, తెలంగాణా టిడిపి నాయకుడు:
ఇంటిలో లేనపుడు దాడిచేసేవాడిని నపుంశకుడు అంటారు. తెలుగుదేశం పార్టీ నేతలు లేనపుడు దాడిచేసిన వారిని ఏమనాలి? హెలీకాప్టర్ లో నాన్న, బాత్రూమ్ లో బాబాయ్ చనిపోయినపుడు జగన్ కు బిపి రాలేదే? పాలన చేతగాక రాష్ట్రం అంధకారం కావడంవల్లే వైసిపి నేతలకు బిపి వస్తోంది. జగన్…మీ తాత తాత, తండ్రులే టిడిపిని ఏం చేయలేకపోయారు, మీరెంత? కొడాలి నానీ…చంద్రబాబు ఇచ్చిన భిక్ష నీకు ఇప్పుడున్న పదవి. చంద్రబాబు మళ్లీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్.
సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ నాయకుడు:
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం సాక్షిగా వైకాపా నేతలు అరాచక పర్వాన్ని సృష్టించారు. ఎపి ప్రజల మనోభావాలు గాయపడేలా దాడిచేశారు, ఇది ఏం సంస్కృతి? డిజిపి అధికారపార్టీ మత్తులో ఉన్నారు, ఇంటిలిజెన్స్ డిజి ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని నవతరం పార్టీ ఖండిస్తోంది. పట్టాభిని కాలర్ పట్టుకుని లాక్కెళ్లారు, ఏం నేరం చేశారు? మీ మంత్రుల నోటిదురుసు వల్ల కదా ఈ పరిస్థితి వచ్చింది?
మానుకొండ శివప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి:
‎వైసీపీ నేతలు శాండ్, ల్యాండ్, వైన్ మాఫియాలతో సిండికేట్ వ్యాపారం చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్త్తున్నారు. అవి చాలక గంజాయి , హెరాయిన్ డ్రగ్స్ ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల కొడుకులు వేల కోట్లు సంపాదిస్తూ యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నారు. గంజాయి, హెరాయిన్ తో రాష్ట్ర యువత భవిష్యత్ పాడవుతోంది, వైసీపీ అధికారంలోకి వచ్చాకా టీ స్టాల్, పాన్ షాపులు, బడ్డీ కొట్లలో సైతం గంజాయి దొరుకుతుంది. దీనికి కారణం గత రెండున్నరేళ్ల నుంచి యువతకు ఉద్యోగాలకు లేకపోవటం వల్ల మత్తు పధర్ధాలకు అలవాటు పడ్డారు. దీనిపై టీడీపీ నేతలు మాట్లాడితే పధకం ప్రకారం దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. రాష్ట్ర యువత భవిష్యత్, రాష్ర్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. వైసీపీ అవినీతి, అరాచాకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. చంద్రబాబు మాకు ఒక్క పిలుపిస్తే జగన్ ఇళ్లు, వైసీపీ ఆఫీస్ కూలగొట్టేందుకు సిద్దంగా ఉన్నాం. కానీ మా నాయకుడు ప్రజాస్వామ్యం బద్దంగా నడుకుంటారు, కాబట్టి మేం శాంతియుంగా ఉన్నాం. ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ..ఎస్సీలపైనే దమనకాండ సాగిస్త్తూ ఆర్దికంగా, రాజకీయంగా దళితులను పాతాళంలోకి తొక్కేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు డా. అంబేద్కర్ ఆశయాలు ముందుకు నడిపిస్తూ దళితులను అన్ని విధాల అభివృద్ది చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులలో 16 వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రాంతం ఉద్దండరాయుని పాలెంలో దళిత వాడలో ఉన్న రోడ్డు గ్రావెల్ తవ్వుకున్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా హోం మంత్రి ఎందుకు స్పందించటం లేదు. రాబోయే రోజుల్లో జగన్ ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.
నాగుల్ మీరా, అధికార ప్రతినిధి:
వైసీపీ గూండాలకు భయపడం. జగన్ అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తాం. దేశ చరిత్రలో రాజకీయ ఆఫీసులపైన దాడి చేసిన ఘనత జగన్ దే. చంద్రబాబులా లోకేష్ చూస్తూ ఊరుకోరు. వైసీపీకి తొత్తుల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మైనారిటీ భక్షకుడు జగన్ రెడ్డి. 100 మంది జగన్ రెడ్డిలు వచ్చినా 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం ఖాయం.
వర్ల కుమార్ రాజా, పామర్రు ఇంచార్జ్:
దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక అని వైసీపీ ముష్కర్లకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి దగ్గరుండి 5 ప్రదేశాల్లో టీడీపీ కార్యాలయాలపై దాడి చేశారు. తీవ్రవాదులు, దేశ ద్రోహులు చేసినట్లుగా అన్ని సిరీస్ ఆఫ్ ఎటాక్ లు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే జగన్ రెడ్డి తప్పు చేశావంటారు, రాజా రెడ్డి బ్రతికి ఉంటే తాతను మించి పోయావంటారు.
మాలతి, లోక్ సత్తా పార్టీ నేత:
జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి కార్యకర్తలు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు అగాహన కల్పించాలి. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అందరూ ఆలోచన చేయాలి. రాష్ట్రం నిర్వీర్యం అయిపోవడానికి కారణమేంటో వెతకండి. ఊరికే దుమ్మెత్తిపోయడం వల్ల ఉపయోగం ఉండదు. కక్ష పూరిత రాజకీయాలు మనకు అలవాటులేదు. కుటుంబవ్యవస్థ మనది. క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఎంత ఉన్నత పదవి అలంకరించినా వృథానే. ప్రజలకు ఏం సంక్షేమం ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేయడం ప్రభుత్వానికి మంచిదికాదు. ఇలాంటి చెత్త రాజకీయాలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. ప్రతిపక్షాల మీదో, ప్రశ్నించే వారిమీదో దాడులు చేస్తే ఉపయోగం లేదు.
మైనేని ఇందిర, టీడీపీ మహిళా నేత:
పరిస్థితులను బట్టి తలదించి నడవడం చంద్రబాబు నేర్పించారు. దెబ్బతగిలిన ప్రతిసారి మనం నాయకుడి వైపు చూస్తున్నాం. వైసీపీ నేతల వేధింపులు వల్ల ఆర్థికంగా, భౌతికంగా వేధిస్తున్నారు. జగన్ లా చంద్రబాబు పబ్జీ ఆడే వ్యక్తి కాదు. అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు. మమ్మల్ని గుర్తు పెట్టుకోవడమే మాకు ఆనందం. కార్యకర్తల సమస్యలు వినాలని నాయకులను కోరుతున్నా. వైసీపీ వాళ్లు మమ్మల్ని ఇంకా కొట్టండి.. మాలో ఇంకా కసి పెరుగుతుంది. వైసీపీ నాయకులను ఉరికొచ్చి కొడతాం. మా దేవాలయాన్ని టచ్ చేసి దాడి చేశారు. మాకు పదవులు వద్దు..వైసీపీని తరిమికొట్టే బలం కావాలి.