– బీఆర్ఎస్ అభ్యంతరంతో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ నామినేషన్ పెండింగ్
– హైడ్రామా తర్వాత నవీన్ నామినేషన్ ఓకే
– సునీత ‘నా తండ్రి భార్య ’ కాదంటూ గోపీనాధ్ తనయుడి ఫిర్యాదు
– వారిది లివింగ్టు గెదర్ అని ఈసీకి తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదు
– గోపీనాధ్ తన తల్లికి విడాకులివ్వలేదని మాగంటి కొడుకు తారక్ స్పష్టీకరణ
– అయినా బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత నామినేషన్ ఓకే
– జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో హైడ్రామా
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ భార్య కాదంటూ ఆయన మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్‌ను రద్దు చేయాలని మాగంటి గోపీనాథ్ మొదటి భార్య తనయుడు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. గోపీనాథ్ భార్య మాలిని అని.. సునీత కాదని ఆరోపించారు. మాలినితో గోపీనాథ్‌కు విడాకులు అవ్వలేదని ప్రద్యుమ్న ఫిర్యాదు చేశాడు.విడాకులు అవకుండానే గత ఎన్నికల సమయంలోనూ గోపీనాథ్ తన అఫిడవిట్లో భార్య స్థానంలో సునీత పేరును పేర్కొన్నట్లు ఆరోపించారు.
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ పై బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్దేశిత కాలమ్స్ లో వివరాలు నింపకుండా తప్పులు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, బీఆర్ఎస్ ఫిర్యాదుతో నవీన్ యాదవ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తున్నారు.
కాగా.. ఫామ్ 26 లోని మొదటి మూడు పేజీలలో ఉన్న కాలమ్స్ విషయంలో అభ్యంతరాలున్నాయని బీఆర్ఎస్ అంటోంది. ఇదే కారణంతో పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు అని రిటర్నింగ్ అధికారి దృష్టికి తెచ్చిన బీఆర్ఎస్ తరఫున న్యాయవాది. అలాంటపుడు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎలా ఒకే చేస్తారని ప్రశ్నించారు. దీనిపై రిటర్నింగ్ అధికారి ఉన్నతాధికారుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చివరకు నవీన్ నామినేషన్‌కు లైన్‌క్లియర్
బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తన తరఫు న్యాయవాది ద్వారా.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ (ఫామ్ 2B)పై అభ్యంతరాలు లేవనెత్తారు. ఫామ్ 26 (అఫిడవిట్)లో మొదటి మూడు పేజీల కాలమ్‌లలో తప్పులు ఉన్నాయని, నిర్దేశిత కాలమ్‌లు ఖాళీగా ఉన్నాయని వాదించారు. ఇదే కారణంతో పలు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారనీ ఆమె రిటర్నింగ్ అధికారి దృష్టికి తెచ్చారు.
దానితో వారి వాదనను అంగీకరించిన రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం, ఈ అభ్యంతరాలను పరిశీలించారు. మొదట్లో నవీన్ యాదవ్‌ను కార్యాలయంలోనే ఆపి, విచారణ చేశారు. నామినేషన్ అంగీకరించకుండా మళ్లీ పిలుస్తాం అని పక్కన పెట్టారు. తర్వాత వివరాలను తనిఖీ చేసి నవీన్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు, అఫిడవిట్లు సరైనవని ధృవీకరించారు.దానితో నామినేషన్ అభ్యంతరాల హైడ్రామాకు తెరపడింది. ఈ ఉత్కంఠతో ఏం జరుగుతుందోనని భయపడిన కాంగ్రెస్ వర్గాలు తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.