– సర్వాంగ సుందరంగా 47 పార్కులు!
– ఏసీ నగర్ లో రూ.25 లక్షలతో మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్క్ మరమ్మతు
– పార్కును అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి
– నగరంలో ఇప్పటికే 40 పార్కులు ఆధునీకరణ పూర్తి
– అభివృద్ధి పనులకు కాలువలు ఆక్రమణదారులు సహకరించాలి
– మంత్రి నారాయణ
నెల్లూరు : ప్రజల మానసిక ఉల్లాసానికి పార్కులను విరివిగా అభివృద్ధి చేస్తున్నామని… అలాగే నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దే విధంగా కాలువలను మరమ్మతులు చేయడానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరు 14వ డివిజన్లోని ఏసీ నగర్ లో రూ.25 లక్షలతో ఆధునికరించిన మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్కును సోమవారం మంత్రి నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు. డివిజన్ కు ఇచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాసేపు పార్కులో అందరితో సరదాగా మాట్లాడారు. ఏర్పాట్లను క్షుణ్ణంగా మంత్రి నారాయణ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలోని 47 పార్కులకు 40 పార్కులను ఆధునీకరించామని, మరో ఏడు పార్కులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మాగుంట సుబ్బరామిరెడ్డి పార్క్ లో వాకర్స్ ట్రాక్ సరిగా లేనందున దాన్ని మరమ్మతులు చేసి పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశింమని, పార్క్ కమిటీ కోరిక మేరకు మూత్రశాలలు, టాయిలెట్లు ఏర్పాట్లు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించినట్టు తెలిపారు.
51, 49 డివిజన్లో కూడా పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పిల్లలకు పెద్దలకు ఉపయోగపడే విధంగా పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవకాశం ఉన్నచోట బోట్ షికార్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని బోడి గాడి తోట వద్ద ఉన్న పార్క్ ని వాటర్ పార్కుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వివిధ రకాల డ్రైన్ ల కు సైడ్ వాల్స్ నిర్మించేందుకు మార్కింగ్ ప్రక్రియ చేపట్టామని, సైడ్ వాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా దోమల నివారణకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
గతంలో రూ.1100 కోట్ల రూపాయలు వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటుకు రూ.960 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని మరో రూ.160 కోట్లను. నేడు మంజూరు చేశామని తెలిపారు. ఉదాహరణకు ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ, తదితరాలు ఉన్నాయని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం వినియోగించుకునేందుకు నుండి ఇచ్చుటకు గాను కేవలం రూపాయి చెల్లించవలసి ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నగరంలో పినాకిని, చిల్డ్రన్స్ పార్క్ వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమీషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.