– బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మధుకర్
విజయవాడ: సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్ గా జరుపుకొంటున్నామని, చంద్రబోస్ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన తీరును ప్రతి ఒక్క యువత గుర్తు చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మధుకర్ అన్నారు.
ఇక్కడి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం నేతాజీ జయంతిని ఘనంగా జరిపారు. మధుకర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పటానికి పూలమాలలు వేసి ఘన నివాళుల అర్పించారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడారు.
స్వాతంత్య్ర సమర వీరులలో అగ్రగణ్యుడు, అలుపెరుగని, ఓటమి లేని పోరాట యోధుడు నేతాజీ అని తెలిపారు. బిట్ర శివన్నారాయణ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం కేవలం చంద్రబోసు పోరాటం వలనే వచ్చిందని, అజాద్ హిందు ఫౌజును స్థాపించి భారత దేశ యువతతో పాటు విదేశాల మద్దతు కూడగట్టి ఆంగ్లేయులకు చుక్కలు చూపించారని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నాయకులు నడింపల్లి ప్రభుకుమార్, చిగురుపాటి లక్ష్మి, ఇమ్మిడిశెట్టి సుమతి, స్వాతి, పాలడుగు సుభాషిని, యర్రాసునీత, శాంతి, యలశిల శ్రీనివాస్, యుగందర్, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.