కేసీఆర్ చేసిన ఆర్థికసాయానికి ప్రతిఫలంగా జగన్ రెడ్డి పోలవరంప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిర్వీర్యం చేశాడు

Spread the love

• ప్రాజెక్ట్ నిర్మాణం, భద్రత, ఎత్తుతగ్గింపు వంటి అంశాలను పూర్తిగా విస్మరించిన జగన్ రెడ్డి, బహుళార్థసాథకప్రాజెక్ట్ ని బ్యారేజీ లా మార్చేశాడు
• లక్షా07వేల నిర్వాసితకుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందని ప్రాజెక్ట్ ఎత్తుని 41.15 మీటర్లకు పరిమితం చేయడానికి సిద్ధమయ్యాడు
• టీడీపీహాయాంలో ఆమోదించిన ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.55.548కోట్లనురాబట్టుకోలేక, ప్రాజెక్ట్ పనులపై చేతులెత్తేశాడు
• టీడీపీహాయాంలో చంద్రబాబునాయుడు ప్రాజెక్ట్ నిర్మాణంలో 72శాతం పనులుచేస్తే, జగన్ రెడ్డి ఈ మూడేళ్లలోచేసింది కేవలం 2శాతం పనులే
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం నిర్మాణంపై నీలినీడలు కమ్ముకునేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రాజెక్ట్ నిర్మాణంప్రశ్నార్థకంగా మారడం, ప్రాజెక్ట్ భద్రత, ఎత్తుతగ్గిం పు వంటి అంశాలపై ఏపీరైతాంగం తీవ్రంగా ఆందోళనచెందుతోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామా నాయుడు స్పష్టంచేశారు.
గురువారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం …

2004-2014 మధ్యన పోలవరంప్రాజెక్ట్ నిర్మాణం చచ్చీచెడీ కేవలం 7శాతం మాత్రమే పూర్తైతే, 2014-19 మధ్య చంద్రబాబు నాయుడి గారిపాలనలో 72శాతంవరకు పూర్తయింది. ప్రతిసోమ వారాన్ని పోలవారంగా మార్చుకొని చంద్రబాబునాయుడు ప్రాజె క్ట్ నిర్మాణపనులుపరుగులు పెట్టించారు. 32,350క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనుల్ని 24గంటల్లోనే పూర్తిచేయించి, గిన్నిస్ రికార్డులకు ఎక్కించినఘనత చంద్రబాబుగారికే దక్కింది.

అంతగొప్ప ప్రాజెక్ట్ పనుల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ పూర్తిగా పక్కనపెట్టేశారు. తనమూడేళ్ల పాలన లో జగన్ రెడ్డి కేవలం 2శాతం పనులుమాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం లో చేయించాడంటే, పోలవరంపై ఈముఖ్యమంత్రికి ఎంతశ్రద్ధ ఉందో అర్థమవుతోంది. టీడీపీహాయాంలో చంద్రబాబునాయుడు చేయించిన ప్రాజెక్ట్ నిర్మాణపనులు వ్యయానికి సంబంధించిన రూ.4వేలకోట్లకుపైగా నిధులు కేంద్రంనుంచి తెచ్చుకున్నజగన్ రెడ్డి, నిర్మాణపనుల్ని మాత్రం 4మీటర్లుకూడా చేయించలేకపోయా డు. ఆఖరికి ప్రాజెక్ట్ నిర్వాసితులైన గిరిజనులకు కూడా జగన్ రెడ్డి రూపాయిపరిహారం కూడా చెల్లించలేదు.

ప్రాజెక్ట్ నిర్మాణంఎప్పుడుపూర్తవుతుందో కూడాచెప్పలేని దుస్థితి లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. తొలిసారేమో 2020 జూన్ నాటికి పూర్తిచేస్తామని, మరోసారి 2021 జూన్ అని, ఇంకోసారి 2021 డిసెంబర్ అని తేదీలుమార్చడంతప్ప, ప్రాజెక్ట్ నిర్మాణంలో పురోగతిని మాత్రం వైసీపీప్రభుత్వం చూపలేకపోయింది.

ప్రాజెక్ట్ నిర్మాణం 2021 డిసెంబర్ నాటికి పూర్తికావడం అసాధ్యమని తాముఅసెంబ్లీలో జలవనరులశాఖామంత్రి అనిల్ కుమార్ కుచెప్తే, ఆయన అవహేళనగా మాట్లాడాడు.అరపర్సెంటా..పావు పర్సెంటా అనేది ముఖ్యంకాదు.. డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణంపూర్తిచేస్తామని, టీడీపీనేత దేవినేనిఉమాని ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి పిలిచి బట్టలుకూడా పెడతామంటూ అని ల్ కుమార్ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఏం సమాధానంచెబుతాడని రాష్ట్రరైతాంగం తరుపున నిలదీస్తున్నాం. ఉమాగారికి బట్టలుపెడతామన్న మంత్రి, ఎక్కడ బట్టలుకుట్టుకుం టున్నాడో చెప్పాలి.

వైసీపీప్రభుత్వనిర్వాకంతో పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటిలో ప్రారంభం కాదని కేంద్రప్రభుత్వం కూడా ఇప్పటికే స్పష్టంచేసింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రిచెప్పిన సమాధానమే అందుకునిదర్శనం. జగ న్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేసిన నాడే ప్రాజెక్ట్ నిర్మాణం గురించి అపహాస్యంగా మాట్లాడారు. అప్పుడే తమకు, రాష్ట్రప్రజలకు ప్రాజెక్ట్ నిర్మాణం ఈ ముఖ్యమంత్రిచేయలేడని అర్థమైంది.తెలుగుజాతి గర్వించేలా నిర్మించాల్సిన పోలవరంప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించడానికి సిద్ధమైన ముఖ్యమంత్రి, బహుళార్థసాథక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బ్యారేజ్ నిర్మాణంగా మార్చాడనే చెప్పాలి.

తెలంగాణ అసెంబ్లీలో ఆరాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్, పోలవరం ఎత్తు తగ్గిస్తే తమకు మంచిదని, భద్రాచలంప్రాంతం ముంపునకు గురికాదనిచెప్పినా ఏపీముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు. కేసీఆర్ వ్యాఖ్యల్ని జగన్ ఖండించనప్పుడే పోలవ రంనిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయని అర్థమైంది.

కేంద్రజలసంఘం ఆధ్వర్యంలో జరిగిన తాజాసమావేశంలోకూడా ఏపీ ప్రభుత్వంనుంచి హాజరైనఅధికారులు సిగ్గులేకుండా ప్రాజెక్ట్ ఎత్తుతగ్గింపునకు సుముఖత వ్యక్తంచేశారు. వాస్తవంగా పోలవరం ఎత్తు 45.72 మీటర్లైతే, దాన్ని 41.15 మీటర్లకే కుదించి నిర్మిస్తా మని అధికారులు చెప్పడం సిగ్గుచేటు. పోలవరంప్రాజెక్ట్ వ్యయం మొత్తాన్ని టీడీపీప్రభుత్వహాయాంలో చంద్రబాబు రూ.55, 548 కోట్లకు కేంద్రం ఆమోదించేలాచేయగలిగారు.

కేంద్రం ఆమోదిం చిన రూ.55,548కోట్ల అంచనావ్యయాన్ని ఢిల్లీపెద్దలనుంచి రాబ ట్టుకోలేని అసమర్థస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. అందుకే ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించడానికి సిద్ధమయ్యాడు. ముఖ్యమంత్రి చెబుతున్న ట్లుగా ప్రాజెక్ట్ ఎత్తుని 41.15 మీటర్లకే పరిమితంచేస్తే, దానివల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రాజెక్ట్ ఎత్తుని గతంలో చెప్పినట్టుగా 45.72మీటర్లకే పరిమితంచేస్తే దాదాపు లక్షా07వేల నిర్వాసితులకుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిఉంది. ఆ పరిహా రం ఎగ్గొట్టి, నిర్వాసితులను గాలికివదిలేయొచ్చన్న దుర్మార్గపు ఆలోచనతోనే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ఎత్తుని తగ్గించడానికి సిద్ధమ య్యాడు.

ప్రాజెక్ట్ఎత్తుని 41.15మీటర్లకే పరిమితంచేస్తే నిర్వాసితు ల కుటుంబాల సంఖ్యకూడా కేవలం 40వేలకే పరిమితమవుతుం దని ఆలోచించే ఈముఖ్యమంత్రి తనఅసమర్థత, చేతగానితనంతో పోలవరాన్ని పొరుగురాష్ట్రానికి, కేంద్రానికి తాకట్టుపెట్టడానికి సిద్ధ మయ్యాడు. 28మందిఎంపీలను ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి నా, ప్రాజెక్ట్ అంచనావ్యయం తాలూకా రూ.55.548కోట్లను కేంద్రం నుంచి సాధించుకోలేని దుస్థితిలో ఉన్నాడు. తనపైఉన్న కేసుల భయంతో, పొరుగుముఖ్యమంత్రిపైఉన్న ప్రేమాభిమానాలతోనే జగ న్మోహన్ రెడ్డి పోలవరంప్రాజెక్ట్ ని నిర్వీర్యంచేశాడు.

జగన్మోహన్ రెడ్డి శైలి తొలినుంచీ వివాదాస్పదమే. ప్రతిపక్షంలో ఉంటేనేమో పోరాటం అంటాడు.. అధికారంలోకి వస్తేనేమో లాలూ చీ అంటాడు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరంప్రాజెక్ట్ ని తప్పుపట్టాడు. ఆప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రా – తెలంగాణ రాష్ట్రాలు ఇండియా పాకి స్తాన్ మాదిరి బద్ధశత్రులు అయి, నీళ్ల కోసం కొట్టుకుంటాయని చెప్పుకొచ్చాడు. 48గంటలపాటు నీటిదీక్షలుచేసి, ప్రజల్నిరెచ్చగొట్టి రాజకీయవ్యభిచారానికి పాల్పడ్డాడు.

తీరా ఇప్పుడేమో ముఖ్యమంత్రి అయ్యాక తానే స్వయంగా వెళ్లి కాళేశ్వరంప్రాజెక్ట్ ని ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా పోలవరం నిర్మాణం చేస్తామని, మనరాష్ట్రంలోని నీటిని, మనడబ్బుతో తెలంగాణ భూభాగంమీదుగా తిరిగి ఏపీకి తెస్తామనికూడాచెప్పాడు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి అలాచెప్పడాన్ని చంద్రబాబుగారుకూడా తీవ్రంగా ఆక్షేపించారు.మననీటిని తెలంగాణకు తరలించి, తిరిగి తెచ్చుకోవడం అంటే అదిఏపీకి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని, పొరుగురాష్ట్రాలైన తమిళనాడు-కర్ణాటక మాదిరి ఏపీ-తెలంగాణలు కూడా నీటికోసం కొట్టుకుంటాయని వివరంగాచెప్పారు.

కానీ చంద్రబాబు మాటల్ని జగన్మోహన్ రెడ్డిహేళనచేస్తూ, కేసీఆర్ సహృదయంతో ముందుకొస్తేచంద్రబాబునాయుడు ఓర్వలేకపోతు న్నాడంటూ సిగ్గులేకుండా మాట్లాడారు. ఇదంతాచూశాక ఈముఖ్యమంత్రి ఎంతటి పోరాట యోధుడో అర్థంచేసుకోవచ్చు.
2019 ఎన్నికలసమయంలో కేసీఆర్ నుంచి తనకు అందిన నిధులకు కృతజ్ఞతగానే జగన్ రెడ్డి, ఏపీప్రయోజనాలను, నీటి అవసరాలను పొరుగుముఖ్యమంత్రికి తాకట్టుపెట్టాడు. పోలవరం ఎత్తుని గోదావరి ట్రిబ్యునల్ 156 అడుగులవరకు నిర్మించుకోవచ్చ ని ఎప్పుడో చెప్పింది. దాన్నిసుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఆ విధంగా పోలవరం ఎత్తుపై కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల అనుమతి లభించి, 72శాతంపనులుపూర్తయ్యాకకూడా ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గిం చడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడంటే అంతకంటే దుర్మార్గం మరోటిఉంటుందా? ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గిస్తే నీటినిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతోంది.

కేవలం 119టీఎంసీల నీరుమాత్రమే ప్రాజెక్ట్ లో నిల్వఉంటుంది.. ఆ నీటివల్ల ఏపీప్రభుత్వానికి, రైతాంగానికి ఎలాం టిఉపయోగం ఉండదు. పోలవరం నిర్మాణంతో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధిచెందే అవకాశాలున్నాయని తెలిసికూడా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అపహాస్యంచేసేలా వ్యవహరిస్తున్నాడు. గోదావరి నీటిని రాయలసీమసహా, రాష్ట్రమంతా ప్రవహించే అవకా శాన్నిపోలవరంప్రాజెక్ట్ కలిగిస్తుంటే, అలాంటి ప్రాజెక్ట్ ని నిరుపయో గంగా మార్చడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధపడ్డాడంటే, అందుకు కారణం తనపైఉన్న కేసులభయమే. గోదావరి జిల్లాల ప్రజాప్రతిని ధిగా ప్రతిఏటా 3వేలటీఎంసీలనీరు సముద్రంలో కలిసిపోతోందని చెప్పడానికి నాకే బాధగా ఉంది.

ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణ సమయంలో కాటన్ మహాశయుడు గోదావరి నీరు సముద్రం పాలుకాకుండా చేయాలని భావించారు. ఆక్రమంలోనే ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించారు. కాటన్ మహాశయుడి మనవరాలు ధవళే శ్వరంతప్ప గోదావరిపై ఏపీలో మరోప్రాజెక్ట్ నిర్మించకపోవడం శోచ నీయమని గతంలోచెప్పారు. ఆమెమాటలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ వాస్తవాలుగుర్తించే చంద్రబాబునాయుడు గారు నదుల అనుసంధాన ప్రక్రియకుశ్రీకారంచుట్టి, గోదావరినదిపై పోల వరంప్రాజెక్ట్ నిర్మాణంచేపట్టారు.

అలాంటిగొప్ప ప్రాజెక్ట్ ని, 194 టీఎంసీల నీటినిల్వసామర్థ్యమున్న ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈ ముఖ్యమంత్రి అనుభవంలేని కంపెనీకి అప్పగించాడు. ప్రాజెక్ట్ భద్రతపైకూడా నీలినీడలుకమ్మేలా జగన్ రెడ్డి వ్యవహరించడం ఉభ యగోదావరి జిల్లాలనునీటముంచడమే అవుతుంది. రాబోయే రో జుల్లో గోదావరి జిల్లాల రైతాంగంతరుపున పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 45.72 మీటర్లఎత్తులోనేసాగేలా, పోరాటంచేస్తామని తెలియచేస్తున్నాం.

Leave a Reply