నారాయణఖేఢ్ లో కొనసాగుతున్న బీజేపీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కవల పిల్లలు : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
ఈసారి బీజేపీ గెలుపు పక్కా: విజయ్ పాల్ రెడ్డి
నాగిల్ గిద్ద: మిగులు ఆదాయంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని తన స్వార్థంతో కేసీఆర్ దివాళా తీయించారన కర్ణాటక బస్వకళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సలగార్ అన్నారు . కేవలం మోసపూరిత హామీలతో రాష్ట్ర ప్రజల్ని ఆయన అవమాన పరుస్తున్నారని దుయ్యబట్టారు.
మంగళవారం నాగిలిగిద్ద, మణూరు మండలాల్లో పార్టీ సంస్ధాగత పరిస్థిత పై ఆయన సమీక్ష నిర్వహించారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీ, రూరల్ మండలం మీటింగ్ లోను ఆయన మాట్లాడారు. దేశంలో పార్టీ జండా పెట్టడానికి అవకాశమే లేదన్న ప్రాంతంలో అధికారంలోకి వచ్చిన ఘనత బీజేపీది అని సలగార్ అన్నారు. పార్టీ టికెట్ ఎవరకి వచ్చినా బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం అందరూ పనిచేయాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కవల పిల్లలు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప విమర్శించారు. నారాయణఖేడ్ తో సహా రాష్ట్రమంతటా ఈ రెండు పార్టీల నాయకులు బయట తిట్టుకుంటూ, లోలోపల కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బును ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి కాంగ్రెస్, బీఅర్ఎస్ సిద్ధమవుతున్నాయని, కాని రాష్ట్ర ప్రజలు ఆ రెండు పార్టీలను తిరస్కరిస్తున్నారని సంగప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన రావాలంటే కేవలం అది బీజేపీ వల్ల మాత్రమే సాద్యం అని ఆయన వివరించారు.
పార్టీలోని అందరు కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు సాధ్యమే అని మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి అన్నారు. నాగిల్ గిద్ద దత్తాత్రేయ ఆలయ ప్రాగంణంలో జరిగిన ఈ సమావేశంలో నగేష్ యాదవ్, రవిగౌడ్, రజినీకాంత్, మారూతి రెడ్డి, సంజు పాటిల్ , రమేష్ యాదవ్, సిద్దయ్య స్వామి, మోహన్ రెడ్డి, నిజానందరెడ్డి, రెండు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.