నెల్లూరు జిల్లాలో నో పోలీస్ వ్యవస్థ..నడుస్తుండేది కేవలం వైసీపీ వ్యవస్థ మాత్రమే

– నెల్లూరు జిల్లా మహిళలు కన్నెర్ర చేస్తే వైసీపీ ప్రభుత్వం కనుమరుగవడం ఖాయం
– రెండున్నరేళ్ల పాలనలో రైతుల గొంతుకోసిన వైసీపీ ప్రభుత్వం
– ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుల అరాచకాలతో రాష్ట్రంలోనే అప్రదిష్ట పాలయింది
రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రిసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ లో జరిగిన నారీ సంకల్ప దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి కనిపించడం లేదు.దిశా చట్టం ఎక్కడ సక్రమంగా అమలు అవుతుంది, అసలికి ఆ చట్టమే ఉందో లేదో, అమలు అవుతుండేది వైసీపీ నాయకుల చట్టమే.

ఐపీఎస్ నేమ్ బ్యాడ్జ్ వైసీపీ ఎమ్మెల్యేల జేబులలో వేసుకుని, ఘోరాలకు పాల్పడుతున్నారు. వైసీపీ పాలనలో ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలు కనిపించడం లేదు. కేవలం వైసీపీ నాయకుల వ్యవస్థ మాత్రమే నడుస్తుంది. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తుంటే ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలు ఎక్కడికి వెళ్లాయి?శాశ్వతంగా ఉండేది వ్యవస్థలు మాత్రమే, అవి ఎక్కడికి వెళ్లావు, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, అధికారులు ఇది గుర్తుంచుకొని పనిచేస్తే ప్రజలకు న్యాయం చేయగలరుచట్టాలు చేసే శాసనసభ్యులకు వ్యవస్థలను శాసించే హక్కు ఎవరిచ్చారు?

గుడివాడలో ఏమో బూతుల మంత్రి ఉంటే, సర్వేపల్లిలో ఏమో బూతులు ఎమ్మెల్యే ఉన్నాడు.. ఈ బిరుదులను పెట్టింది మేము కాదు ప్రజలే.సర్వేపల్లి నియోజకవర్గంలో గోవర్ధన్ రెడ్డి అరాచక, నిరంకుశ పాలనే సాగుతుంది.సర్వేపల్లిలో అమల అవుతుండేది పోలీసు వ్యవస్థ కాదు, గోవర్ధన్ రెడ్డి వ్యవస్థ.సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు మహిళను అడ్డుపెట్టుకొని రేప్ వంటి అక్రమ కేసులను తమ నాయకుల పై బనాయిస్తున్నారు.అక్రమ రేప్ కేసులు పెట్టేందుకు వైసీపీ నాయకులకు సిగ్గూ, శరం లేదేమో.. ఇది అక్రమ కేసు అని తెలిసి కూడా నమోదు చేస్తున్న పోలీసులు సిగ్గుపడటం లేదు.

సర్వేపల్లిలో బాధితులు ఇచ్చే కేసులు సక్రమంగా వున్న వాటిని ఏమో కట్టరు, వైసీపీ నాయకులు ఇచ్చే అక్రమ కేసులు కట్టేందుకు పోలీసులు ముందుగా ఉంటారు.. ఇదెక్కడి న్యాయం.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు జిల్లాలో లెక్కలేనన్ని అక్రమ కేసులను అధికార పార్టీకి తలొగ్గి పోలీసులు నమోదు చేశారు.ఆనాటి పోనక కనకమ్మ, రోశమ్మ, బాలసరస్వతమ్మ దగ్గర నుండి అనేకమంది మహిళా ఉద్యమకారులు స్వతంత్ర పోరాటం మొదలుకొని అనేక ఉద్యమాలు నెల్లూరు గడ్డపై చేశారు.

నేటి మహిళలు వారిని ఆదర్శంగా తీసుకొని మహిళల ఆత్మ గౌరవాన్ని అడుగడుగునా భంగపరుస్తున్న వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో నిత్యవసర ధరల నుండి భవన సామాగ్రి, పెట్రోల్, డీజిల్, వంట నూనె, వంట గ్యాస్ ధరల వరకు అన్ని పెరిగితే ..రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా చేశారు.

వైసీపీ పాలనలో రైతులు ఆర్థికంగా చితికిపోయి అప్పుల ఊబిలోకి కూరుకుపోయి రైతు కుటుంబాలు నాశనం అయిపోయాయి.చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుంది.స్వర్గీయ ఎన్టీ రామారావు నుండి చంద్రబాబు వరకు మహిళలకు పెద్దపీట వేయడంతోనే మహిళలు అనేక రంగాల్లో రాణించారు.టీడీపీ హయాంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన చరిత్ర స్వర్గీయ ఎన్టీ రామారావు, చంద్రబాబులదే.

ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని రామారావు, నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సత్యవేడు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ జేడీ రాజశేఖర్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, జెడ్ శివప్రసాద్, తాళ్ళపాక అనురాధ, పలువురు మహిళా నాయకురాలు, టీడీపీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.