తెలంగాణ సర్కార్ కాదు.. రియలెస్టేట్ బ్రోకర్

– ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఫైర్

ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజల ఆస్తులు అమ్మడం సామాజిక నేరం. ప్రజల ఆస్తులకు రక్షకుడిగా ఉండాల్సింది పోయి బక్షకుడిగా మారి పేదల భూములు లాక్కొని టీఆర్ఎస్ ప్రభుత్వం రియలేస్టేట్ బ్రోకర్ గా మారిపోయింది.

ఆత్మ గౌరవం, ఆర్ధిక భద్రత కోసం గత ప్రభుత్వాలు ఎస్సి, ఎస్టీ, బీసీ, పేదలకు భూములు ఇస్తే ఆ భూములని టీఆర్ఎస్ ప్రభుత్వం రియలెస్టేట్ గద్ద మాదిరి లాక్కోంటుంది. టీఆర్ఎస్ నాయకులు, సంపన్నుల భూములని ఇలానే లాక్కోగలదా? టీఆర్ఎస్ నాయకుల వద్ద వున్న అసైన్డ్‌ భూములు లాక్కొనే దమ్ము కేసీఆర్ కి ఉందా?

సందుకో బారు పెట్టి ప్రజలని తాగించి వాళ్ళ రక్త మాంసాలు పిండి ఖజానా నింపుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్… మరో పక్క పేదల భూములు లాక్కొని రియలెస్టేట్ దందాలు చేసి నాలుగు వేల గజాల భూమి తీసుకొని నాలుగు వందల గజాలు బిచ్చమేసినట్లు ఇవ్వడం దుర్మార్గం.

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క తెలంగాణలోనే 22 లక్షల ఎకరాలని దళితులు, గిరిజనులు, బీసీలకు భూములు ఇచ్చింది. వారికి ఆత్మ గౌరవం కల్పించింది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని మాయమాటలు చెప్పిన కేసీఆర్ భూమి ఇవ్వకపోగా భూముని గుంజుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ కేసీఆర్ సొంత ఆస్తా ? అమ్మడానికి, వెంచర్లు వేయాడానికి కేసీఆర్ ఎవరు ? ఇదేమి తలకు మాసిన అభివృద్ధి నమూనా?

గతంలో కబ్జాదారులు ప్రభుత్వ భూములు కబ్జా చేసేవారు. కానీ నేడు ప్రభుత్వమే కబ్జా చేసి సెటిల్మెంట్ చేస్తుంది, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు.

తెలంగాణ ఉద్యమ సమయంలో అసైన్డ్‌ భూ యజమానులకు శాశ్వత భూ హక్కులు ఇస్తామని నిర్ణయించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక్క ఎకరం అసైన్డ్‌ భూమి ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పేదవారు ఎవరూ భూయజమానులు కాలేదు. కేవలం టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలే ఫామ్ హౌస్లు, బంగ్లాలు కట్టుకున్నారు, భూస్వాములైనారు..పేద వారికి భూమి ఇవ్వలేదు .. వున్న భూమిని కూడా లాక్కుంటున్నారు. ఇంత దుర్మార్గమా ?

లీడర్లు రియలెస్టేట్ బ్రోకర్లుగా మారిపోయారు. వారు బ్రోకర్లుగా మారడమే కాకుండా ఐఎఎస్, ఏంఆర్వో, ఆర్డీఓ లని కూడా రియలెస్టేట్ బ్రోకర్లుగా మార్చేశారు.

”ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజల ఆస్తులు అమ్మడం సామాజిక నేరం. కంచే చేను మేసినట్లు ప్రజల ఆస్తులకు రక్షకుడిగా ఉండాల్సిందిపోయి బక్షకుడిగా మారి పేదల భూములు లాక్కొని టీఆర్ఎస్ ప్రభుత్వం రియలేస్టేట్ బ్రోకర్ గా మారిపోయింది” అని మండిపడ్డారు ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో దాసోజు మాట్లాడారు.పేదల వద్ద అర కొర భూములు ఉంటె, తెరాస పెద్దలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ, వారి భూములను వెంచర్ల పేరుమీద లాక్కోవడం నేరం.

”ఆత్మ గౌరవం, ఆర్ధిక భద్రత కోసం గత ప్రభుత్వాలు ఎస్సి, ఎస్టీ, బీసీ, పేదలకు భూములు ఇస్తే ఆ భూములని టీఆర్ఎస్ ప్రభుత్వం రియలెస్టేట్ గద్దలు మాదిరి లాక్కోవడానికి ప్రయత్నించడం నేరం. రాజకీయ నాయకుల, సంపన్నుల వద్ద భూములు వుంటే ఇలా లాక్కోగలదా? ప్రభుత్వం నడపటం చేతకాక టీఆర్ఎస్ ప్రభుత్వం రియలెస్టేట్ బ్రోకర్లు గా మారిపోయింది. సందుకో బారు పెట్టి ప్రజలని తాగించి వాళ్ళ రక్త మాంసలు పిండి ఖజానా నింపుకుంటున్నారు. మరో పక్క పేదల భూములు లాక్కొని రియలెస్టేట్ దందాలు చేసిన నాలుగు వేల గజాల భూమి తీసుకొని నాలుగు వందల గజాలు బిచ్చగాళ్ళకి ఇచ్చినట్లు ఇస్తారా? అని మండిపడ్డారు దాసోజు.

”ఆచార్య వినోబా భావే భూదానోద్యమం గానీ పీవీ నరసింహరావు తీసుకొచ్చిన భూసంస్కరణ చట్టాలు, ఇందిరా గాంధీ చేపట్టిన పధకాలు పేదవారి ఆత్మ గౌరవం కల్పించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క తెలంగాణలోనే 22 లక్షల ఎకరాలని దళితులు, గిరిజనులు, బీసీలకు భూములు ఇచ్చింది. వారికి ఆత్మ గౌరవం కల్పించింది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన కేసీఆర్ .. అసెంబ్లీ సాక్షిగా మాట మార్చి తాను ఆ మాట అనలేదని బుకాయించారు. పైగా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముని గుంజుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ కేసీఆర్ సొంత ఆస్తా ? అమ్మడానికి, వెంచర్లు వేయాడానికి కేసీఆర్ ఎవరు ? ప్రశ్నించారు దాసోజు.

”మేడ్చల్ సాయిప్రియ నగర్ వద్ద 350 ప్లాట్లుకి సంబధించిన రాత్రిరాత్రికే ప్రభుత్వ భూమి అని బోర్డ్ పెట్టారు. ప్లాటు యజమానులు కేటీఆర్ చుట్టూ ఎన్ని ప్రదక్షణలు చేసినా ఇంకా భూములు యజమానులు ఇవ్వడం లేదు. గతంలో కబ్జాదారులు ప్రభుత్వ భూములు కబ్జా చేసేవారు. కానీ నేడు ప్రభుత్వమే ప్రైవేట్ భూములను కబ్జా చేసి కమీషన్లు తీసుకొని సెటిల్మెంట్ చేస్తుంది, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు” అని మండిపడ్డారు దాసోజు.

”తెలంగాణ ఉద్యమ సమయంలో అసైన్డ్‌ భూ యజమానులకు శాశ్వత భూ హక్కులు ఇస్తామని నిర్ణయించుకున్నాం. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలో బాగమయ్యారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బ్రతకోచ్చని ఆశపడ్డారు. కానీ నేడు సొంత రాష్ట్రంలో వారికి అడుగడుగునా అవమానాలలే ఎదురౌతున్నాయి. అసైన్డ్‌ భూములని గద్దలా తన్నుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ఎకరం అసైన్డ్‌ భూమి ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పేదవారు ఎవరూ భూయజమానులు కాలేదు. కేవలం టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలే ఫామ్ హౌస్లు బంగ్లాలు కట్టుకున్నారు. కానీ పేద వారికి భూమి ఇవ్వరు.. వున్న భూమిని కూడా లాక్కుంటున్నారు. ఇంత దుర్మార్గమా ? టీఆర్ఎస్ నాయకుల వద్ద వున్నఅసైన్డ్‌ భూములు లాక్కొనే దమ్ము కేసీఆర్ కి ఉందా? పేదల వద్ద నుంచి అని ప్రశ్నించారు దాసోజు.

” తెరాస లీడర్లు రియలెస్టేట్ బ్రోకర్లుగా మారిపోయారు. వారు బ్రోకర్లుగా మారడమే కాకుండా ఐఎఎస్, ఏంఆర్వో, ఆర్డీఓ లని కూడా రియలెస్టేట్ బ్రోకర్లుగా మార్చేశారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం అసైన్డ్‌ భూమి తీసుకోవచ్చు. కానీ డానికి తగిన పరిహారం చెల్లించి తీసుకోవాలి. కానీ ఎలాంటి పరిహారం చెల్లించకుండ వెంచర్లు వేసి అందులో నాలుగు వందల గజాలు ఇస్తామని చెప్పి ప్రజలని బిచ్చగాళ్ళగా మార్చే కుట్ర నడుస్తుంది. ఈ కుట్రని ప్రజలు తిప్పి కొట్టాలి. పేదల భూమి జోలికి వస్తే తరిమితరిమి కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ పేదలకు ప్రజలకు అండగా వుంటుంది” అని పేర్కొన్నారు దాసోజు.
ఈ మీడియా సమవేశంలో టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తాహెర్ సాది పాలుగోన్నారు.

Leave a Reply