మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అక్కంపేట, అచ్చంపేట గ్రామాల్లో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు చెందిన జమున హెచరీస్ కు నోటీసులు జారీ చేసినట్టు కలెక్టర్ హరీష్ తెలిపారు. సోమవారం నాడు కలెక్టరేట్లో కలెక్టర్ హరీష్ విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 16 17 18 తేదీల్లో హైకోర్టు ఆదేశాల మేరకు జమున హచరిస్ లో ప్రభుత్వ భూములను సర్వే చేస్తున్నామని అందుకు సంబంధించిన నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
గతంలో జమున హెచరీస్ హకీంపేట్ అచ్చంపేట గ్రామాలలో అసైన్డ్ ల్యాండ్,ప్రభుత్వ భూములు ఉన్నాయని సర్వే చెయ్యాలని కోర్టు ఆదేశాల మేరకు అప్పుడు సర్వే చేశామని…జమున హెచరీస్ సర్వే ఆపాలని హైకోర్టులో రిట్ వేసిందని కొన్ని రోజులు సర్వే ఆపాలని, కరోనా నేపథ్యంలో టైం ఇవ్వాలని కోర్టును కోరిందన్నారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో కరోన తగ్గుముఖం పట్టడంతో కోర్టు ఆదేశాల మేరకు సర్వేను కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ హరీష్ తెలిపారు.